పెను తుఫాన్ బీభత్సంలో పుట్టిన పసిబిడ్డ.. పేరు ఫణి

కరెక్టుగా ఫణి తుఫాన్ పూరీ తీరాన్ని తాకే సమయంలో ఆ బిడ్డ భూమి మీదకు వచ్చింది.

news18-telugu
Updated: May 3, 2019, 5:54 PM IST
పెను తుఫాన్ బీభత్సంలో పుట్టిన పసిబిడ్డ.. పేరు ఫణి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వైపు ఒడిశాలో ఫణి తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న సమయంలో.. మరోవైపు అదే ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ కళ్లు తెరిచింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు సమీపంలోని మాంచెశ్వర్‌లో ఉన్న రైల్వే ఆస్పత్రిలో ఓ మహిళ ప్రసవించింది. కరెక్టుగా ఫణి తుఫాన్ పూరీ తీరాన్ని తాకే సమయంలో ఆ బిడ్డ భూమి మీదకు వచ్చింది. దీంతో ఆ పసిపాపకు ఫణి అని ఆమె తల్లిదండ్రులు పేరు కూడా పెట్టేశారు. రైల్వే ఉద్యోగి అయిన ఆ పసిబిడ్డ తల్లికి నొప్పులు రావడంతో రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు డాక్టర్ హరిహర్ దాస్, డాక్టర్ ఆర్కే మహాపాత్ర, డాక్టర్ ఎస్కే సిరాజుద్దీన్, డాక్టర్ మాఝీ కలసి పురుడుపోశారు. ఉదయం 11.03గంటలకు పసిబిడ్డ భూమిమీదకు వచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

భువనేశ్వర్‌లో ఫణి తుఫాన్ సమయంలో పుట్టిన బిడ్డ


First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>