• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • ODISHA SILVER INGOTS RECOVERED FROM EMAR MUTT IN PURI SU

Emar Mutt: మఠంలోని గదిలో వెలుగుచూసిన సంపద.. వెండి ఇటుకలు, కాంస్య విగ్రహాలు.. 11 ఏళ్ల తర్వాత మరోసారి..

Emar Mutt: మఠంలోని గదిలో వెలుగుచూసిన సంపద.. వెండి ఇటుకలు, కాంస్య విగ్రహాలు.. 11 ఏళ్ల తర్వాత మరోసారి..

ఎమార్ మఠం సమీపంలో కూల్చివేత పనులు(ఫైల్ ఫొటో)

ఎమార్‌ మఠంలో మరోసారి భారీగా సంపద వెలుగుచూసింది. ట్రస్టు బోర్డు బాధ్యతల స్వీకరణలో భాగంగా మఠంలోని ఓ గదిని తెరిచి చూడగా ఈ ప్రాచీన సంపద బయటపడింది.

  • Share this:
    పూరీలోని పురాతన ఎమార్ మఠం మరోసారి వార్తల్లో నిలిచింది. శనివారం ఎమార్ మఠంలోని ఓ గదిని తెరిపించగా.. అత్యంత విలువైన ప్రాచీన సంపద వెలుగుచూసింది. ఆ గదిలో ప్రాచీన కాంస్య ఆవు, దూడ విగ్రహంతోపాటుగా 16 పురాతన కత్తులు, 47 వెండి ఇటుకలు, ఆభరణాలు, వంటపాత్రలు బయటపడ్డాయి. ఇంతకు ముందు 2011వ సంవత్సరంలో 522 వెండి ఇటుకలు వెలుగు చూడటం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక, ఈ మఠానికి గతంలో ఉన్న మహంత ఆధిపత్యం రద్దు చేసి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు బాధ్యతల స్వీకరణ పురస్కరించుకుని మఠంలో‌ని ఓ గదిలో ఈ సంపద వెలుగుచూసింది. సంపద లెక్కింపుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు. ఈ ఘటనతో మఠంలో భారీగా ప్రాచీన సంపద ఉందనే భక్తుల నమ్మకం బలపడినట్టైంది. అయితే ఇప్పుడు వెలుగుచూసిన సంపద.. గతంలో ఖరారు చేసిన జాబితాలో ఉన్నదీ లేనిదీ స్పష్టం కావలసి ఉంది

    12వ శతాబ్దంలో సంత్‌ రామానుజాచార్య ఆగమనం పురస్కరించుకుని ఈ ఎమార్ మఠం నిర్మిచినట్టుగా చెబుతారు. అయితే అప్పటి నుంచి ఈ మఠం ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీ మందిర కారిడార్‌ నిర్మాణాల్లో భాగంగా మఠంలో కొన్ని శిథిల భాగాలు ఇదివరకు తొలగించారు. అయితే ఆధునీకరణ పనుల్లో భాగంగా ట్రస్టు ఆధ్వర్యంలో మేజిస్ట్రేట్ సమక్షంలో మఠంలోని రహస్య గదులను తెరిపిస్తున్నారు. ఇప్పటికే వాటిలో భారీ సంపద ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. రహస్య గదుల్లో బయటపడుతున్న సంపద విలువను లెక్కించడంతో పాటుగా, లభించిన వస్తువుల జాబితాను సిద్ధం చేయనున్నారు.

    ప్రేమించినవాడిని పెళ్లిచేసుకుంది.. అంతలోనే పక్కింటి కుర్రాడితో వివాహేతర సంబంధం.. చివరకు ఎంత నీచమైన పనిచేసిందంటే..

    క్యాబ్‌లో బయలుదేరిన ఐటీ ఉద్యోగిని.. ఆ చిన్న పని ఆమె కొంప ముంచింది.. స్పృహలోకి వచ్చేసరికి హోటల్ రూమ్‌లో షాకింగ్ సీన్..

    2011లో ఏం జరిగింది.. ?
    2011లో ఎమార్ మఠంలోని 2 గదుల మరమ్మతు కోసం పనులు చేపట్టారు. ఆ సమయంలో భారీగా వెండి ఇటుకలు బయటపడ్డాయి. మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రెండు వెండి ఇటుకలను దొంగిలించారు. అది ఢెంకనాల్‌కు తరలిపోయింది. అయితే వెండి ఇటుకలు కనుగోన్న ఢెంకనాల్ పోలీసులు ఇవి.. ఎమార్ మఠానికి చెందినవి గుర్తించారు. దీంతో అప్పుడు బయటపడిన మొత్తం 522 వెండి ఇటుకలను.. కోర్టు ఆదేశాల మేరకు పూరీ జిల్లా పోలీసు కార్యాలయంలో భద్రపరిచారు. 18 టన్నుల బరువు గల ఈ సంపద విలువ.. రూ. 90 కోట్లు ఉంటుందని అంచన.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు