Home /News /national /

ODISHA MLA AMONG 5 LAKH STUDENTS APPEARING FOR CLASS 10 BOARD EXAM

MLA : వాళ్లందరికీ ఈ ఎమ్మెల్యే ఓ ఇన్సిపిరేషన్ అంతే

ఎమ్మెల్యే అంగాడ కన్హార్

ఎమ్మెల్యే అంగాడ కన్హార్

MLA appearing for Class 10 exam: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 70 ఏళ్ల ఎమ్మెల్యే. ఈ వయసులోనూ పదో తరగతి​ పరీక్షలకు హాజరై మధ్యలోనే చదువు ఆపేసిన చాలా మందికి ఒక ప్రేరణగా నిలిచారు.

MLA appearing for Class 10 exam: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 70 ఏళ్ల ఎమ్మెల్యే. ఈ వయసులోనూ పదో తరగతి​ పరీక్షలకు హాజరై మధ్యలోనే చదువు ఆపేసిన చాలా మందికి ఒక ప్రేరణగా నిలిచారు. ఆయనే ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్​.

ఒడిశాలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన బోర్డు పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,540 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. వారితో పాటు 9378 మంది ఓపెన్​ స్కూల్​, 4443 మంది మాధ్యమ పరీక్షల రాశారు. మే 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే శుక్రవారం పదో తరగతి విద్యార్థులతో కలసి ఫుల్బాని నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగాడ కన్హార్​(70)కూడా బోర్డు పరీక్షలు రాశారు. అంగాడ కన్హార్..1978లోనే తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినా పదో తరగతి పూర్తి చేయాలని తపనపడేవారు. ఈ క్రమంలో బోర్డు ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(బీఎస్​ఈ) నిర్వహిస్తోన్న హైస్కూల్​ వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. కంధమాల్ జిల్లాలోని పితాబరి గ్రామంలో రుంజంగీ స్కూల్ లో పరీక్ష రాశారు. ఆయన హాజరైన పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Odisha

తదుపరి వార్తలు