హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tragic : వాహనం లేకపోవడంతో..కొడుకు శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి

Tragic : వాహనం లేకపోవడంతో..కొడుకు శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన తండ్రి

Father Walks With Son Body On Shoulder : మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహ‌నాలు అందుబాటులో లేవు.  కొద్ది గంటల పాటు వేచి చూసినా కూడా ఫలితం లేకపోవడంతో ఆ తండ్రి త‌న భుజంపైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు సురధర్ . కొడుకు మృతదేహాన్ని భుజంపై ఆర కిలో మీట‌రు వ‌ర‌కు న‌డుకుంటూ తీసుకెళ్లారు.

ఇంకా చదవండి ...

Father Walks With Son Body On Shoulder : ఒడిషాలో హృదయవిదారక సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన తన కుమారుడి మృత‌దేహాన్ని తీసుకేళ్లేందుకు వాహ‌నాలు లేక‌పోవ‌డంతో త‌న భుజాలపైనే మోసుకెళ్లాడు ఓ తండ్రి. కొడుకు మృతదేహాన్ని భుజంపై ఆర కిలో మీట‌రు వ‌ర‌కు న‌డుకుంటూ తీసుకెళ్లారు.

రాయ‌గ‌డ జిల్లా హరిజ‌న్ సాహి ప్రాంతానికి చెందిన‌ ఆకాశ్ బ‌నియా వ‌య‌స్సు తొమ్మిదేళ్లు. ఆడుతూ పాడుతూ తిర‌గాల్సిన వ‌య‌స్సులో కొద్ది రోజులుగా డయేరియాతో బాధ‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికే మందుల కోసం చాలా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారు త‌ల్లి దండ్రులు. ఆదివారం ఉదయం ఆ బాలుడికి సిరియ‌స్ అయ్యింది. వెంటనే బాలుడి తండ్రి 41 ఏళ్ల సురధర్ బ‌నియా కంగారుప‌డి ద‌గ్గ‌ర‌లోని రాయ‌గ‌డ జిల్లా ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అయితే హాస్పిటల్ కి తీసుకొచ్చే లోపే మీ కొడుకు మృతి చెందాడు అని డాక్టర్ రాజేంద్ర సోరెన్ చెప్పడంతో సురధర్ గుండే బ‌ద్దులైపోయింది. బాలుడు కుటుంబ స‌భ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వాహ‌నాలు అందుబాటులో లేవు.  కొద్ది గంటల పాటు వేచి చూసినా కూడా ఫలితం లేకపోవడంతో ఆ తండ్రి త‌న భుజంపైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు సురధర్ . కొడుకు మృతదేహాన్ని భుజంపై ఆర కిలో మీట‌రు వ‌ర‌కు న‌డుకుంటూ తీసుకెళ్లారు. చుట్టుముట్టిన బంధువుల రోదనలతో తన తొమ్మిదేళ్ల కుమారుడు ఆకాశ్ మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి నుండి రాయగడ పట్టణంలోని హరిజన్ సాహిలోని తన ఇంటికి తీసుకెళ్లాడు.

ALSO READ Muslim Businessman : రామాలయం నిర్మాణానికి రూ. కోట్లు విలువచేసే భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం

సురధర్ మరియు అతని కుటుంబం శవ వాహనాన్ని ఏర్పాటు చేయడానికి DHH అధికారులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది ఈ ఆరోపణలను ఖండించారు. రాయగడ కలెక్టర్ సరోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మహాప్రయాన్ సేవ కోసం డీహెచ్‌హెచ్‌లో తగినన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లాల్మోహన్ రౌత్రే తెలిపారు.

2016లో, కలహండి జిల్లాకు చెందిన దానా మాఝీ..వాహనం అందుబాటులో లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని భుజంపై మోసుకుని 12 కి.మీల దూరం ప్రయాణించిన విషయం దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఒడిశా ప్రభుత్వం మహాప్రయాన్ పథకాన్ని అమలు చేసింది.

First published:

Tags: Odisha, Viral Video

ఉత్తమ కథలు