news18-telugu
Updated: November 23, 2020, 9:01 AM IST
ఒడిశా గవర్నర్ గణేశీ లాల్‌కి భార్యావియోగం... శ్రీమతి సుశీలా దేవి కన్నుమూత (credit - twitter)
ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశీ లాల్ సతీమణి శ్రీమతి సుశీలా దేవి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి... ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలైన సుశీలా దేవి చాలా మంచివారనీ... అందర్నీ చక్కగా పలకరిస్తూ.... ఎంతో అన్యోన్యంగా ఉండేవారని నవీన్ పట్నాయక్ అన్నారు. తన ప్రగాఢ సానుభూతిని గవర్నర్ గణేశీ లాల్, ఆయన కుటుంబ సభ్యులకు తెలిపిన నవీన్ పట్నాయక్... సుశీలా దేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కొంతకాలంగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న సుశీలా దేవి... రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఐతే... ఆమెతోపాటూ.. గవర్నర్, మరో నలుగురు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని నవంబర్ 1న తేలింది. వారంతా ఇప్పటికీ ట్రీట్మెంట్ పొందుతూనే ఉన్నారు.
సుశీలాదేవి కరోనా పాజిటివ్‌గా కన్నుమూశారు కాబట్టి... రాష్ట్ర కొవిడ్ 19 మార్గదర్శకాల్ని అనుసరించి... అంత్యక్రియలు జరపనున్నారు. అవి పూరీ స్వర్గద్వారం దగ్గర జరగనున్నాయి.
Published by:
Krishna Kumar N
First published:
November 23, 2020, 8:57 AM IST