హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Family planning kit : ప్రభుత్వం కొత్త స్కీమ్..నూతన దంపతులకు కండోమ్ లు,గర్భనిరోధక మాత్రలు!

Family planning kit : ప్రభుత్వం కొత్త స్కీమ్..నూతన దంపతులకు కండోమ్ లు,గర్భనిరోధక మాత్రలు!

 ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Family planning kit : కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు ఒడిషా(Odisha) ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Condoms, pills to newly married couples: కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు ఒడిషా(Odisha) ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టనుంది. "నవ దంపతీ('Nabadampati)"​ లేదా "నయి పహల్(Nayi Pahal)​"అనే పేరుతో రాష్ట్రంలో నూతన వధూవరులకు గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లతో కూడిన ఉచిత కిట్‌ను అందించేందుకు నవీన్ పట్నాయక్ సర్కార్ నిర్ణయించింది. సురక్షితమైన సెక్స్, కుటుంబ నియంత్రణ,జననాల మధ్య అంతరం యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపై బుక్ లెట్ కూడా ఈ కిట్ లో ఉంటుంది. వాటితో పాటు ప్రతి కిట్‌లో రెండు తువ్వాలు, నెయిల్ కట్టర్, అద్దం, దువ్వెన, రుమాలు, వివాహ నమోదు పత్రం ఉంటాయి.

ఈ కిట్ లను నూతన వధూవరులకు ఆశా వర్కర్లు అందిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్‌ను పంపిణీ చేస్తుందని ఒడిషా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బిజయ్ పాణిగ్రాహి తెలిపారు.

Swamiji Missing : పెళ్లైన మహిళతో స్వామీజీ పరార్..సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు!

ఈ పథకం ద్వారా నూతన వధూవరులకు కుటుంబ నియంత్రణ కార్యక్రమం గురించి ఆరోగ్య శాఖ అవగాహన కల్పిస్తుందని, రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. నూతన వధూవరులకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఆశా కార్యకర్తలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు పాణిగ్రాహి తెలిపారు.

First published:

Tags: Odisha

ఉత్తమ కథలు