HOME »NEWS »NATIONAL »odisha government extents lockdown till april 30 ak

LockDown Extension | లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా

LockDown Extension | లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా
ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ పొడిగింపు అనివార్యమని అనేక రాష్ట్రాలు అభిప్రాయపడుతున్న తరుణంలో... ఈ అంశంలో ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం.

  • Share this:
    దేశంలో లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందా ? ఉంటే అది ఏ విధంగా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11న ముఖ్యమంత్రులతో జరపబోయే వీడియో కాన్ఫిరెన్స్ తరువాత ప్రధాని నరేంద్రమోదీ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ పొడిగింపు అనివార్యమని అనేక రాష్ట్రాలు అభిప్రాయపడుతున్న తరుణంలో... ఈ అంశంలో ముందుగానే ఓ నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది.





    ఏప్రిల్ 30 వరకు తమ రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం... తమ రాష్ట్రానికి అప్పటివరకు ఎలాంటి విమాన, రైలు సర్వీసులు అనుమతించవద్దని కేంద్రాన్ని కోరింది. జూన్ 17 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఒడిశాలో 42 కరోనా కేసులు నమోదు కాగా... ఒకరు చనిపోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published:April 09, 2020, 12:34 IST