‘పర్సంటేజ్ కమీషన్’... ఒడిశా కేబినెట్‌పై మోడీ విమర్శలు

ఒడిశాలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని పర్సెంటేజీ కమీషన్లు తీసుకునే సర్కార్‌గా అభివర్ణించారు. ప్రధాని వ్యాఖ్యలతో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదనే సంకేతాలు వెలువడ్డాయి.

news18-telugu
Updated: September 22, 2018, 6:34 PM IST
‘పర్సంటేజ్ కమీషన్’... ఒడిశా కేబినెట్‌పై మోడీ విమర్శలు
ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు కురిపించారు. జర్సుగూడలో కొత్త ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ... నవీన్ పట్నాయక్ సర్కార్ పర్సంటేజ్ కమీషన్లు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ కారణంగానే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. బీజేడీ ప్రభుత్వంలో లంచం లేకుండా లబ్దిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని.. మరుగుదొడ్ల నిర్మాణం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వరకు పరిస్థితి ఇలాగే ఉందని మోడీ అన్నారు. ఒడిశాలో అభివృద్ధి జరగాలంటే భారీ మార్పు రావాలన్నారు.

ఇటీవల జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయేకు బీజేడీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశాలో బీజేడీ, బీజేపీ మధ్య కలిసి పని చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా బీజేడీపై విమర్శల దాడి చేయడంతో... వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ మధ్య పొత్తు లేదా అవగాహన ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
First published: September 22, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading