హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Inspration Man: ఎందరికో మార్దదర్శిగా మారిన సామాన్యుడు జయదేవ్ భొత్ర.. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?

Inspration Man: ఎందరికో మార్దదర్శిగా మారిన సామాన్యుడు జయదేవ్ భొత్ర.. ఇంతకీ ఏం చేశారో తెలుసా..?

ఆదర్శంగా నిలుస్తున్న జయ్ దేవ్ భొత్ర

ఆదర్శంగా నిలుస్తున్న జయ్ దేవ్ భొత్ర

Inspirational man: అతడు ఒక సామాన్యుడు.. ఆర్థిక బలం లేదు.. రాజకీయ పలుకబడి లేదు.. కానీ 50 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చాడు. సొంత ఖర్చుతో.. శ్రమించి మరి పేదల కోసం బ్రిడ్జి నిర్మించాడు.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

  Inspration Man:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఒడిషా (Odisha) సరిహద్దు గ్రామాలు ఇప్పటికీ పూర్తిగా వెనుకబడే ఉన్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూర్తి మౌలిక వసతులు లేవు. కనీస అవసరాలు లేని గ్రామాలు చాలానే దర్శనమిస్తాయి. కొన్ని గ్రామాల్లో అయితే నిత్యావసరాల కోసం అక్కడి వారంతా నదిలో ప్రమాదకర పరిస్థితుల్లో నాటుపడవలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. వర్షకాలం వచ్చింది అంటే వారి కష్టాలు వర్ణాతీతం. ఈ క్రమంలో తన కళ్ల ముందు జరిగిన ఎన్నో పడవ బోల్తా ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి, కలత చెందాడు ఓ సామాన్యుడు. ఎలాగైనా అక్కడి వారి కష్టాలను తీర్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన కష్టార్జితంతో కొనుక్కొన్న కాస్తంత భూమిని సైతం లక్ష రూపాయలకు అమ్మేశాడు. దాంతో వంతెన నిర్మాణం చేపట్టి, దాదాపు 50 గ్రామాల ప్రజల రాకపోకలకు మార్గ సుగమం చేశాడు. వారి పాలిట మార్గదర్శిగా నిలిచాడు. అతడే నవరంగపూర్‌ జిల్లా, కొశాగుమడ సమితి, కొకొడిసెమల గ్రామపంచాయతీ, కంఠసురగుడకు చెందిన జయదేవ్‌ భొత్ర.

  నవరంగపూర్‌–కొరాపుట్‌ జిల్లాలకు చెందిన దాదాపు 50 గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం కొరాపుట్‌ జిల్లాలోని కొట్‌పాడ్, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ ప్రాంతాలపై ఆధారపడుతుంటారు. వీరంతా వాటి కోసం కంఠసురగుడ వద్ద ఇంద్రావతి నది మీదుగా పడవ ప్రయాణం చేసి, తమ గమ్య స్థానాలను చేరుకుంటారు. అయితే ఇలా నది దాటే క్రమంలో జరిగిన పడవ బోల్తా ఘటనల్లో చాలామంది చనిపోయారు.

  ఇదీ చూడండి: మహా పాదయాత్రపై రాజకీయ మంటలు.. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దాడి చేశారన్న మంత్రి పేర్నినాని

  ఈ నేపథ్యంలో శాశ్వత వంతెన కోసం అక్కడి ప్రజలంతా నేతలు, అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మానవత్వంతో ముందుకు వచ్చిన ఆదివాసీ జయదేవ్‌ భొత్ర తనకున్న కాస్త పొలాన్ని అమ్మేసి, వెదురుకర్రలతో నదిపై తాత్కాలిక వంతెన నిర్మించాడు. 110 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి 600కి పైగా వెదురు కర్రలు, మేకులు, ఇనుప సామగ్రి, ప్లాస్టిక్‌ వైర్లు ఉపయోగించినట్లు జయదేవ్‌ తెలిపాడు.

  ఇదీ చూడండి: పుష్పక విమానం డైరెక్టర్‌ దామోదర గురించి ఆ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. ఇది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

  అతడు చేపట్టిన ఈ పనిని చూసి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, శాశ్వత వంతెన నిర్మాణానికి ముందుకు వస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. సామాన్యుడే అయినా.. తన దగ్గర ఆస్తులు లేవు.. రాజకీయ అండ లేదు.. అయినా పేదల కష్టాలు చూసి సొంత ఖర్చు.. శ్రమతో ఒక బ్రిడ్జిని నిర్మించాడు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Helping, Life Style, Odisha

  ఉత్తమ కథలు