ODISHA BIJU JANATA DAL MLA FROM PHULBANI ANGADA KANHAR APPEARED FOR HIS CLASS 10TH EXAMINATIONS SK
Mla 10th Exam: టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన ఎమ్మెల్యే.. 58 ఏళ్ల వయసులో కలను నెరవేర్చుకున్నారు..
పరీక్షా కేంద్రంలో బీజేడీ ఎమ్మెల్యే
Odisha MLA Tenth class Exam: ముందు కాస్త భయపడ్డానని.. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు తనను ప్రోత్సాహంతో.. ఎట్టకేలకు పరీక్ష రాశానని అంగద చెప్పుకొచ్చారు. పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు
నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ.. దానికి ఏదీ అడ్డూకాదు. వయసు మీద పడుతున్నా.. పేదరికంలో మగ్గిపోతున్నా.. చదవాలనే కిసి ఉంటే..ఏవీ మిమ్మల్ని వెనక్కి లాగలేవు. పట్టుదల ఉంటే.. మీరు అనుకున్నది సాధించవచ్చు. తాజాగా ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే... చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. 15 ఏళ్ల వయసులోనే పదో తరగతి చదవాలని.. ఏజ్ పెరిగితే.. చదువు కష్టమనే ఆలోచనను ఆయన పక్కనబెట్టేశారు. 58 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలతో కలిసి పదో తరగతి పరీక్ష రాశారు.
ఒడిశాలోని పుల్బానీకి చెందిన అంగద కన్హర్ బిజూ జనతా దళ్ (BJD) పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధిత్యం వహిస్తున్నారు. అంగద వయసు 58 ఏళ్లు. ఈయన పెద్దగా చదువుకోలేదు. 1980లో పదో తరగతి చదివారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా పరీక్షలు రాయలేదు. ఆ తర్వాత మళ్లీ బడి మెట్లెక్కలేదు. పుస్తకం పట్టలేదు. కొన్నేళ్ల తర్వాత రాజకీయాల్లో వచ్చి రాణించారు. బీజేడీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఒడిశా విధాన సభ ఎన్నికల్లో పుల్భానీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను పదో తరగతి పాస్ కాలేదన్న బాధ మాత్రం మనసులో ఎప్పూడూ ఉండేది. ఐతే తన కంటే పెద్ద వారు కూడా.. ఎంతో కష్టపడి.. పెద్ద వయసులోనూ చదువులను పూర్తి చేశారని ఆయనకు తెలిసింది. ఈ క్రమంలో తాను కూడా పదో తరగతి పరీక్షలు రాయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈసారి పదో తరగతి పరీక్షలు రాని తన కలను నెరవేర్చుకున్నారు.
Odisha | Biju Janata Dal (BJD) MLA from Phulbani, Angada Kanhar appeared for his Class 10th examinations. He was among the 5.8 lakh students appearing for the Class 10 state board examination in Odisha that commenced on Friday. pic.twitter.com/hFWNJjXZ5l
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) నిర్వహిస్తున్న హైస్కూల్ వార్షిక పరీక్షలకు శుక్రవారం అంగద హాజరయ్యారు. కంధమాల్ జిల్లా పితాబరి గ్రామంలోని రుజంగీ ఉన్నత పాఠశాలలో 67 మంది విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే అంగద పదో తరగతి పరీక్ష రాశారు. ఎమ్మెల్యే పరీక్ష రాస్తుడడంతో.. ఆ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 5.8 లక్షల మంది పరీక్ష రాయగా.. అందులో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సంకల్పం ఉంటే.. చదువును ఏ వయసులోనైనా పూర్తి చేయొచ్చని తెలుసున్నానని అంగద చెప్పారు. పరీక్షకు హాజరై చదువు పూర్తిచేయాలనేది తన కోరికని ఆయన పేర్కొన్నారు. ముందు కాస్త భయపడ్డానని.. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు తనను ప్రోత్సాహంతో.. ఎట్టకేలకు పరీక్ష రాశానని చెప్పుకొచ్చారు. పరీక్షల్లో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 58 ఏళ్ల వయసులోనూ పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తుంది. నిజంగా గ్రేట్ సర్.. అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.