ఢిల్లీలో మళ్లీ బేసి-సరి విధానం... కేజ్రీవాల్ ప్రకటన

Delhi : దేశ రాజధాని అన్న పేరే గానీ... ఢిల్లీలో వాతావరణం నానాటికీ దారుణంగా తయారవుతోంది. ఏం చెయ్యాలో తెలియని ప్రభుత్వం మళ్లీ బేసి-సరి (odd-even)విధానం తేవాలని నిర్ణయించుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 1:22 PM IST
ఢిల్లీలో మళ్లీ బేసి-సరి విధానం... కేజ్రీవాల్ ప్రకటన
అరవింద్ కేజ్రీవాల్
Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 1:22 PM IST
Odd-Even Number Scheme : ఢిల్లీ ప్రజలు సహకరించాలని మరోసారి వేడుకున్నారు సీఎం కేజ్రీవాల్. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. రాబోయే శీతాకాలంలో కాలుష్యానికి తోడు... పొగ మంచు తెరలా అల్లుకుంటుంది. దీని వల్ల రోడ్లపై వాహనాలు నడపడం చాలా కష్టమైపోతుంది. ప్రజలకు కూడా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని... సీఎం కేజ్రీవాల్... మళ్లీ ఢిల్లీలో బేసి-సరి విధానం తేవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 4 నుంచి 15 వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ నెంబరులో చివరి అంకె సరి ఉన్న వాహనాలు ఒక రోజు... బేసి ఉన్న వాహనాలు మరో రోజు రోడ్డు మీదకు రావాలని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.


ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో వాయు కాలుష్యం బాగా ఎక్కువైపోవడంతో 2016లో తొలిసారిగా బేసి-సరి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలుచేసింది. ఆ తర్వాత చాలాసార్లు ఈ విధానాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అందువల్ల ఈ విధానం కొంతవరకూ మంచి ఫలితాలే తెచ్చింది. ఐతే... కొంతకాలంగా ఇలాంటి రూల్స్ ఏవీ అమల్లో లేవు. ఇప్పుడు భవిష్యత్ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని... మళ్లీ తెస్తున్నారు.ఢిల్లీలో మొత్తం 12 ప్రదేశాల్లో అత్యంత ఎక్కువ కాలుష్యం ఉంది. వాటిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది. మాటిమాటికీ రోడ్లను ఊడ్చేసే కార్యక్రమం కూడా అమలవుతోంది. తద్వారా రోడ్లపై దుమ్ము అన్నదే లేకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. ఇలా 7 అంశాల అజెండా ఒకటి అమలవుతోంది. పొల్యూషన్ అంతు చూసేందుకు ప్రత్యేకంగా ఓ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...