ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రముఖ నటి

మందులను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల నుస్రత్ ఆస్పత్రిపాలయ్యారని పుకార్లు వచ్చాయి.

news18-telugu
Updated: November 19, 2019, 10:28 AM IST
ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రముఖ నటి
బెంగాలీ నటి నుస్రత్ జహాన్
  • Share this:
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు నుస్రత్ జహాన్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆమె ఆదివారం రాత్రి అపోలో గ్లెనెగల్స్ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు డాక్టర్లు. మందులను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల నుస్రత్ ఆస్పత్రిపాలయ్యారని పుకార్లు వచ్చాయి. దీంతో వాటిని ఆమె కుటుంబసభ్యులు కొట్టిపారేశారు. ఆదివారం రాత్రి శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆమెని 9.30 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో సోమవారం సాయంత్రం ఇంటికి పంపించేశారు.

ఆమెకు ఎప్పటినుంచో ఆస్తమా ఉందని, ఈ సమస్యతో ఆమె తరచూ ఇన్హేలర్‌ను వాడుతారని తెలిపారు. ఈ సమస్య ఆదివారం ఎక్కువగా అయిపోవడంతో ఆస్పత్రిలో చేరారన్నారు. నుస్రత్ ఆరోగ్యంపై జరుగుతన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. మరోవైపు నుస్రత్ జహాన్‌ భర్త నిఖిల్ జైన్ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి నుంచి భార్యతోనే ఉండి దగ్గరుండి ఆమెను చూసుకున్నారు.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>