NEET 2019 Hall Ticket: నీట్ - 2019 ఎంట్రన్స్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల... ఆన్ లైన్లో పొందడం ఎలా ?

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ పరీక్షను మే 15 నిర్వహించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: April 15, 2019, 9:11 PM IST
NEET 2019 Hall Ticket: నీట్ - 2019 ఎంట్రన్స్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల... ఆన్ లైన్లో పొందడం ఎలా ?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 15, 2019, 9:11 PM IST
దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ -2019 పరీక్ష హాల్ టిక్కెట్లు ఆన్‌లైన్లో లభ్యమవుతున్నాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్ పరీక్షను మే 15 నిర్వహించనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. నీట్ 2019 పరీక్ష ద్వారా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కింద నిర్వహించబడుతున్న ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ చేస్తారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పిన్ నెంబర్ ఆధారంగా నీట్ అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.inలోకి వెళ్లి హాల్ టిక్కెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నీట్ 2019 హాల్ టికెట్స్ పొందండి ఇలా :

- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ ntaneet.nic.in విజిట్ చేయండి.

- ఆ తర్వాత 'డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్' ని క్లిక్ చేయండి



- అభ్యర్థులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నింపాలి

- సబ్‌మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ 2019 వస్తుంది.

- అడ్మిట్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి.
Loading...
పరీక్ష తేదీ:
నీట్ ఎంట్రన్స్ పరీక్ష మే 5, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల నడుమ నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షా సమయం 3 గంటలు, పరీక్షా ఫలితాలు మాత్రం జూన్ 5, 2019న విడుదల చేస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్‌తో పాటు హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు నీట్ 2019 పరీక్ష రాయనున్నారు.
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...