Home /News /national /

NOW YOU CAN WATCH LIVE DARSHAN OF PANDHARPUR SHRI VITTHAL RUKMINI MANDIR IN JIO TV GH SK

Pandharpur Vitthal: జియో TVలో పండరీపూర్ విఠలుడి దర్శనం లైవ్.. ఇంటి నుంచే దర్శించుకోండి

పండరీపూర్ విఠలుడి ఆలయం

పండరీపూర్ విఠలుడి ఆలయం

Pandharpur Vitthal Darshan: ఇప్పుడు మహారాష్ట్రతో పాటు భారతదేశం అంతటా ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లోనే విఠలుడిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది జియో ప్లాట్‌ఫామ్. జియో టీవీలో 24×7 పండరీపూర్ విఠలుడి ప్రత్యక్ష దర్శనం లైవ్ స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది.

ఇంకా చదవండి ...
Pandharpur Vitthal: మన దేశంలో విష్ణుమూర్తి ఆలయాలు ఎన్నో వెలిశాయి. పూర్వీకుల కాలం నుంచి ఈ ఆలయాల్లో పూజలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానమైనది మహారాష్ట్రలోని పండరీపూర్‌ లేదా పండరీపురంలో ఉన్న విఠలుడి దేవాలయం. స్థానికంగా విఠల్ రుక్మిణి ఆలయం (Vitthal Mandir Pandharpur)గా ప్రాశస్త్యం పొందిన ఈ మందిరానికి దేశ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఆషాఢ మాసంలో, ముఖ్యంగా ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు భారతదేశం అంతటా ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లోనే విఠలుడిని  (Shri Vitthal Rukimini Mandir Samiti, Pandharpur) దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది జియో ప్లాట్‌ఫామ్. జియో టీవీలో 24×7 పండరీపూర్ విఠలుడి ప్రత్యక్ష దర్శనం లైవ్ స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఆషాఢ ఏకాదశి సందర్భంగా భక్తులకు జియో ఈ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

మరిచిపోయి తాబేలు ఉంగరాన్ని ఇలా ధరించకండి.. ఏరోజు ఎలా ధరించాలో నియమాలు తెలుసుకోండి..

వందల సంవత్సరాల నాటి పండర్‌పూర్‌ ఆలయానికి ఆషాఢ, కార్తీక ఏకాదశి శుభ సందర్భంగా భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ సందర్భంగా విఠలుడి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చొని ఎదురు చూస్తుంటారు. కానీ కరోనా మహమ్మారి, ఇతర కారణాల వల్ల ప్రస్తుతం భక్త సమూహం గతంలో మాదిరిగా పండరీపూర్ వెళ్లే పరిస్థితులు లేవు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న భక్తులు ఇష్టపూర్వకంగా ఆలయాన్ని సందర్శించలేరు. కానీ ఇప్పుడు ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త పరిష్కారాన్ని జియో టీవీ (Jio TV) అన్వేషించింది. విఠలుడి ఆలయానికి వెళ్లలేని భక్తుల కోసం మొబైల్ ఫోన్‌ నుంచే దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేసింది.



ఇప్పుడు భక్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ స్మార్ట్‌ఫోన్‌లో పాండురంగని ప్రత్యక్ష దర్శనం పొందవచ్చు. ఇంట్లోనే ఉండి విఠలుడి మహా పూజ, అభిషేకం, ఇతర ఆచారాలను కూడా చూడవచ్చు. ఇందుకు భక్తులు జియో టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. మొబైల్‌లో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా ప్రత్యక్ష దర్శనాన్ని చూడవచ్చు.



లైవ్ దర్శనం కోసం భక్తులు Jio TVలోని విఠల్ రుక్మిణి ఛానెల్‌కు వెళ్లి, 'Darshan' ఐకాన్‌పై క్లిక్ చేయవచ్చు. ఇంతకుముందు అమర్‌నాథ్, చార్ధామ్, కొల్హాపూర్ మహాలక్ష్మి, అష్టవినాయక గణేష్, ఇతర ప్రముఖ మందిరాల నుంచి కూడా జియో టీవీలో లైవ్ దర్శనం కోసం ఏర్పాట్లు ఉన్నాయి. జియో టీవీ ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఈ దేవతామూర్తుల ప్రత్యక్ష దర్శనాన్ని ఆస్వాదిస్తున్నారు.

నేడు దలైలామా 87వ పుట్టినరోజు.. ఈ ఆధ్యాత్మిక గురువు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇ

మహారాష్టల్రోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ‘పండరీపురం’ ఒకటి. పుండరీకుడు అనే భక్తుడి కోసం వచ్చిన పాండురంగడు ఇక్కడ వెలసినట్లు పండితులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని భీమా నది తీరాన వెలసిన విఠలుడి ఆలయం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీమహా విష్ణువు విఠోబా పేరుతో వెలసినట్లు భక్తుల నమ్మకం. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఇక్కడ మహా హారతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని దేవస్థానం ఆహ్వానించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: JIO TV, Maharashtra

తదుపరి వార్తలు