Camel milk: దేశవ్యాప్తంగా ఒంటె పాలు... ముందుగా మెట్రో నగరాల్లో అమ్మకాలు

Camel milk: దేశవ్యాప్తంగా ఒంటె పాలు... ముందుగా మెట్రో నగరాల్లో అమ్మకాలు (ప్రతీకాత్మక చిత్రం)

Camel milk: మన దేశంలో శ్వేత విప్లవం (పాల విప్లవం) గుజరాత్‌లోనే వచ్చింది. ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచి ఒంటె పాల విప్లవం రాబోతోంది. అదేంటో, ఎలాగో తెలుసుకుందాం.

 • Share this:
  Camel milk: ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు ఇవన్నీ మనకు తెలిసినవే. ఒంటె పాలతో మనకు పెద్దగా టచ్ ఉండదు. కానీ... గుజరాత్‌లో ఒంటె పాలకు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి కచ్‌ ప్రాంతంలోని... సర్హాద్ డైరీ (Sarhad Dairy)... దేశవ్యాప్తంగా ఒంటె పాలను అమ్మాలని డిసైడైంది. ముందుగా మెట్రో నగరాలు, నగరాలకు దాన్ని విస్తరించాలనుకుంటోంది. ఇందుకోసం పాలు నిల్వ ఉండేలా... వాటిని అల్ట్రా హై టెంపరేచర్ ట్రీటెడ్ (UHT) విధానంలో ప్యాకింగ్ చెయ్యబోతోంది. తద్వారా... దేశవ్యాప్తంగా ఒంటె పాల వినియోగదారుల సంఖ్యను పెంచి... తన వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటోంది. ఇప్పటికే గుజరాత్‌లోని ఆనంద్ నుంచి... భారీ ఎత్తున పాల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడీ ఒంటె పాలతో లాభమేంటి అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు:
  మనం తాగం కాబట్టి ఒంటె పాల వల్ల ఏం ఉపయోగమో మనకు తెలియదు. నిజానికి ఒంటె పాలలో సహజ సిద్ధమైన ఇన్సూలిన్ లాంటి ప్రోటీన్ ఉంటుంది. ఇది టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరం. అంతేకాదు... ఈ పాలలో విటమిన్ సీ, ఐరన్‌తోపాటూ చాలా పోషకాలు ఉంటాయి. అందుకే ఈ పాలను దేశమంతా అమ్మాలనుకుంటున్నారు. ఆనంద్‌లోని అమూల్ కంపెనీ... ఒంటె పాలను గుజరాత్‌ అంతటా అమ్ముతోంది. ఈ మధ్య గుజరాత్‌లోని పట్టణ వినియోగదారులు ఒంటె పాలను బాగా కొంటున్నారు. దీన్ని గమనించిన... సహకార పాల ఉత్పత్తి దారుల సంఘం (సర్హాద్ డైరీ)... ఈ పాలను దేశమంతా ఎందుకు అమ్మకూడదు అని ఆలోచించింది. గుజరాత్ కోపరేటింవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF)లో ఈ డైరీ మెంబర్‌గా ఉంది. దేశవ్యాప్తంగా 1 లీటర్ UHT పాల ప్యాకెట్లతోపాటూ... 25 గ్రాముల ఒంటె పాల పొడి ప్యాకెట్లను అమ్మాలనుకుంటోంది. అందువల్ల త్వరలోనే మనమంతా... సూపర్ మార్కెట్లలో, డైరీల్లో ఒంటె పాల ఉత్పత్తుల్ని చూస్తాం అనుకోవచ్చు.

  "మేము కొన్నాళ్లుగా ఒంటె పాల ఉత్పత్తుల్ని బాగా పెంచాం. మాకు ఇప్పుడు అవసరమైన దాని కంటే ఎక్కువగా పాలు వస్తున్నాయి. అందువల్ల మేము మా బిజినెస్‌ని విస్తరించాలనుకుంటున్నాం. UHT ప్యాకెట్లలో పాలు... 6 నెలల వరకూ నిల్వ ఉంటాయి. పాల పొడి ప్యాకెట్లను ఎక్కడైనా వాడుకోవచ్చు. అందువల్ల మేము మా దగ్గరకు వచ్చే పాలన్నింటినీ అమ్మేలా ప్లాస్ వేసుకుంటున్నాం" అని సర్హాద్ డైరీ ఛైర్మన్ వలంజీ హంబాల్ తెలిపారు.

  "ఒంటె పాలలో... 7 శాతం ఫ్యాక్ కాని పదార్థాలు (SNF) ఉంటాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియలో లీటర్ పాల ధర రూ.100 ఉండగా... UHT ప్యాకెట్లలో ధర రూ.125 ఉంది. ఎవరికైతే... లాక్టోజ్ పడదో... వారు ఈ ఒంటె పాలను వాడొచ్చు. గేదె పాలను తాగడం ఇష్టం లేని వారు ఈ పాలను ట్రై చెయ్యవచ్చు. ప్రస్తుతం మా డైరీ రోజుకు రూ.1600 లీటర్ల పాలను అమ్ముతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో మేము రోజుకు 400 నుంచి 500 లీటర్లు మాత్రమే అమ్మేవాళ్లం. ఈ మధ్య మేము మరిన్ని పాల అమ్మకపు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కచ్ జిల్లాలోని నాలుగు తాలుకాల్లో ఈ పాలను మేము అమ్ముతున్నాం" అని వలంజీ తెలిపారు.

  సర్హాద్ డైరీలో మొత్తం 200 ఒంటెలు ఉన్నాయి. ఒక్కో ఒంటె నుంచి రోజుకు సగటున రూ.200 సంపాదిస్తున్నారు. పాలను లీటర్ రూ.51కి కొంటున్నారు. ప్రతి ఒంటే రోజుకు రూ.5 లీటర్ల పాలు ఇస్తుంది. అని వలంజీ వివరించారు.

  ఇది కూడా చదవండి: గేదె చేసిన పనికి రైతుకు రూ.10,000 ఫైన్... మరి అతను ఆ జరిమానా చెల్లించాడా?

  ఇదంతా చదివాక మనకు ఏమనిపిస్తుంది... త్వరలోనే ఒంటె పాల విప్లవం రావడం ఖాయం అనిపిస్తోంది కదూ. నిజమే... మన దేశంలో డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఫాస్ట్‌ఫుడ్ వాడకం పెరిగే కొద్దీ... షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. అందువల్ల ఒంటె పాల వాడకానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని గుర్తించారు కాబట్టే సర్హాద్ డైరీ వారు... ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: