హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

RailWire Kiosks: గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ల‌లోనూ ఆధార్, పాన్ కార్డు సేవలు.. పూర్తి వివరాలు

RailWire Kiosks: గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్ల‌లోనూ ఆధార్, పాన్ కార్డు సేవలు.. పూర్తి వివరాలు

రైల్‌వైర్ సాథీ కియోస్క్

రైల్‌వైర్ సాథీ కియోస్క్

Railwire saathi Kiosks: దేశవ్యాప్తంగా దాదాపు 200 రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ కియోస్క్‌లను రైల్ టెల్ ఏర్పాటు చేస్తుంది. వీటిలో అత్యధికం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి.

  ఆధార్ (Aadhaar Card), పాన్ కార్డు(Pan Card)ల్లో మార్పులు చేర్పులు చేయడం కామన్ అయిపోయింది. పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి చాలా ఈజీగా ఈ సేవలు అందుతున్నాయి. కానీ ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరికీ రైల్వేశాఖ (Indian Railways) శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు.. పాన్ కార్డ్‌ సంబంధించి ఏదైనా అప్‌డేట్ చేయాలనుకునే వారు..ఇకపై ఆధార్ సేవా కేంద్రం, మీ-సేవల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్‌‌లోనే మీకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా ఈ సేవలు మీకు లభిస్తాయి. పైలట్ ప్రాజెక్టుగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్‌లలో కామన్ సర్వీస్ సెంటర్లను రైల్వేశాఖ ప్రారంభించింది.

  వారణాసి, ప్రయాగ్ రాజ్ మాత్రమే కాదు.. త్వరలో దేశంలోని ఇతర రైల్వే స్టేషన్‌లోనూ సీఎస్‌సీ కియోస్క్‌లు ప్రారంభమవుతాయి. ఈ కియోస్క్‌లకు 'రైల్‌వైర్ సాథీ కియోస్క్ (Railwire Saathi kiosks)' అని పేరు పెట్టారు. వీటిని కామన్ సర్వీస్ సెంటర్స్‌కు చెందిన గ్రామ స్థాయి వ్యాపారులు (VLE) నిర్వహిస్తారు. ఈ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాలలో రైలు, విమాన, బస్సు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్‌తో పాటు మొబైల్ ఫోన్ రీఛార్జ్, విద్యుత్ బిల్లు చెల్లింపు, ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధించి ఎలాంటి పని ఉన్నా ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు.

  ఈ ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ.24కే సాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ లో ఖతర్నాక్ ఆఫర్

  దేశవ్యాప్తంగా దాదాపు 200 రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ కియోస్క్‌లను రైల్ టెల్ (RailTel) ఏర్పాటు చేస్తుంది. వీటిలో అత్యధికంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 44 ఏర్పాటు చేయబోతున్నారు. 20 నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ పరిధిలో 20, తూర్పు మధ్య రైల్వేలో 13, పశ్చిమ రైల్వేలో 15, ఉత్తర రైల్వేలో 25, పశ్చిమ మధ్య రైల్వేలో 12, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 13, ఈశాన్య రైల్వేలో 56 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలను CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు.

  SBI ఖాతాదారులకు అలర్ట్.. అలాంటి మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

  కాగా, రైల్వే శాఖకు చెందిన ప్రభుత్వ రంగం సంస్థ రైల్‌టెల్ భారతదేశంలోని రైల్వే స్టేషన్‌లలో కామన్ సర్వీస్ సెంటర్ (csc) కియోస్క్‌లను నిర్వహించే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తో పాటు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.

  అమెజాన్ లో బంపరాఫర్.. కేవలం రూ.399కే Redmi 9A స్మార్ట్ ఫోన్.. ఇలా కొనేయండి

  చాలా ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యం లేని కారణంగా qఅక్కడి ప్రజలకు ఈ గవర్నెన్స్ సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Aadhaar Card, Indian Railways, PAN card, Trains

  ఉత్తమ కథలు