ఈ రోజుల్లో ప్రతీ ప్రభుత్వ పథకానికి, అవసరానికి ఆధారం తప్పనిసరిగా మారింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా.. విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందాలన్నా.. చివరకు వాహనాన్ని కొనాలన్నా.. ఆధార్ ఉండాల్సిన పరిస్థితి. అయితే అప్పుడే పుట్టిన శిశువుకు(1 రోజు వయస్సు) కూడా ఆధార్ కార్డు పొందొచ్చు. ఈ మేరకు UIDAI ఇటీవల ప్రకటన విడుదల చేసింది. చిన్నారి 1 రోజు వయస్సు ఉన్నా కూడా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యుఐడీఏఐ ట్వీట్ చేసింది. ఇందు కోసం శిశువు జనన ధృవీకరణ పత్రం అవసరం. ఈ పత్రాన్ని ఆస్పత్రి నుంచి పొందొచ్చు. తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి అవసరం. మొదట మీరు ఆసుపత్రి నుంచి జనన ధృవీకరణ పత్రం పొందాలి. కొన్ని ఆస్పత్రులు తమ సొంత ఆధార్ కార్డు దరఖాస్తు ప్రక్రియను కూడా అందిస్తున్నాయి.
నవజాత శిశువు యొక్క బయోమెట్రిక్ సమాచారాన్ని ఆధార్ కార్డుకు అప్లై చేయడానికి తీసుకోబడదు. దీంతో చిన్నారుల నుంచి ఎలాంటి ఫింగర్ ఫ్రింట్ తీసుకోరు. పిల్లలకు 5 సంవత్సరాల వయస్సుకు వచ్చినప్పుడు ఆ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చని UIDAI తెలిపింది.
ఎలా అప్లై చేయాలంటే..
మొదట https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఫామ్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల పేరు, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ నమోదు చేయాలి. పిల్లల పేరును దరఖాస్తు ఫారంలో నింపాలి. మీ పేరు, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి. ఆ తర్వాత మీకు సమీపంలోని ఆధార్ కార్డు సెంటర్కు అపాయింట్మెంట్ లభిస్తుంది. అపాయింట్మెంట్ ఉన్న రోజు.. టైమింగ్ ప్రకారం ఆధార్ సెంటర్కు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలి. అక్క కావాల్సిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ పత్రాల ధృవీకరణ అనంతరం ఆధార్ జారీ చేస్తారు.