Save Water: నీరు వృథా చేస్తే జైలు, భారీ ఫైన్... వచ్చేస్తున్నాయి కొత్త మార్గదర్శకాలు

Save Water: మన దేశంలో కనీసం తాగడానికి కూడా నీరు లేని కోట్ల మంది ఉన్నారు. అదే సమయంలో నీటిని వృథా చేసేవారూ కోట్లలో ఉన్నారు. ఇకపై నీరు వేస్ట్ చేస్తే కఠిన చర్యలే.

news18-telugu
Updated: October 24, 2020, 8:54 AM IST
Save Water: నీరు వృథా చేస్తే జైలు, భారీ ఫైన్... వచ్చేస్తున్నాయి కొత్త మార్గదర్శకాలు
Save Water: నీరు వృథా చేస్తే జైలు, భారీ ఫైన్... వచ్చేస్తున్నాయి కొత్త మార్గదర్శకాలు
  • Share this:
Save Water: ఎన్నో జీవనదులకు నిలయమైన భారత దేశంలో... నీటిని కొనుక్కునే దుస్థితి ఉంది. దారుణమేంటంటే... కొన్నిచోట్ల కొనుక్కుందామన్నా నీరు దొరకని స్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాగు నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త మార్గదర్శకాలు రెడీ చేస్తోంది. వాటి ప్రకారం... నీటి వృథా చేసేవాళ్లు... రూ.లక్ష ఫైన్, 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించక తప్పదు. ఇందుకోసం కేంద్ర జల శక్తి శాఖ, నీటి వనరుల విభాగం, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన అధ్వర్యంలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథార్టీ (CGWA)... 1986 పర్యావరణ రక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ఓ నోటిఫికేషన్ జారీచేసింది. నీటి వృథాను అరికడుతూ... అలా వృథా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేయాలంటూ... రాజేంద్ర త్యాగి అండ్ ఫెండ్స్ స్వచ్ఛంద సంస్థ... పిటిషన్ వేయడంతో... దాన్ని లెక్కలోకి తీసుకున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)... కేంద్రానికి ఆదేశాలు ఇవ్వడంతో... CGWA ఈ గైడ్ లైన్స్ రెడీ చేస్తోంది.

నోటిఫికేషన్ ప్రకారం... ఇకపై నీటికి సంబంధించి విధులు నిర్వహించే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పౌర సంఘాలు, జల్ బోర్డు, జల్ నిగమ్, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్, డెవలప్ మెంట అథార్టీ, పంచాయత్, ఇతర సంబంధిత కార్యాలయాలు... తమ పరిధిలోని ప్రజలు నీటిని వేస్ట్ చెయ్యకుండా చూడాల్సి ఉంటుంది. ట్యాపుల నుంచి వచ్చే వాటర్ వేస్ట్ అవ్వకుండా చెయ్యాల్సి ఉంటుంది. అలాగే వేస్టే చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం... దేశంలోని ఏ ఒక్క వ్యక్తి కూడా నీటిని వృథా చెయ్యడానికి వీల్లేదు. అలాగే... పైపుల ద్వారా వచ్చే భూగర్భ జలాలను నిర్లక్ష్యంగా వినియోగిస్తే చర్యలు తప్పవు.

2025 నాటికి ఇండియాలో 25 శాతం నీటి కొరత ఏర్పడనుంది. అందుకే అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ప్రత్యేకంగా లేఖలు పంపింది. ఎక్కడా, ఎవ్వరూ నీటిని వేస్ట్ చెయ్యకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది.

నేషనల్ కమిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ డెవలప్ మెంట్ ప్రకారం... ఏటా ఇండియాలో 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల (BCM) నీరు లభిస్తోంది. ఇందులో కొంత ఆవిరి అయిపోగా... 1869 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వాడుకునేందుకు వీలవుతోంది. ఇందులో 1122 బీసీఎం నీటిని వాడుతున్నారు.

చాలా మంది ఇళ్లపై ఉండే ట్యాంకుల్లో నీటిని నింపుకుంటున్నారు. ఒక్కోసారి ట్యాంకులు నిండిపోయినా... మోటర్లను ఆపకపోవడంతో... ట్యాంకుల నుంచి నీరు కిందకు వచ్చేస్తూ.. రోడ్లపై ప్రవహిస్తూ వేస్ట్ అవుతోంది. ఇకపై ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలుంటాయి. అలాగే... టాయిలెట్లలో ఊరిగే నీరు వృథా చేసినా యాక్షన్ తప్పదు. స్నానం, పాత్రలు తోమేందుకు, చేతులు కడుక్కోవడానికీ... ఇలా ప్రతీ అంశంలోనూ నీటిని పొదుపుగా వాడుకోవాల్సిందే. లేదంటే చర్యలుంటాయి. అలాగే... పైపులకు కన్నాలు లేకుండా చూసుకోవాల్సిందే. ఎవరు ఏ విధంగా నీటిని వృథా చేసినా చర్యలు తీసుకుంటామని జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: October 24, 2020, 8:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading