హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Land for Job scam : లాలూకి మరో షాక్.."ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్" లో లాలూ ఇంట్లో సీబీఐ సోదాలు

Land for Job scam : లాలూకి మరో షాక్.."ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్" లో లాలూ ఇంట్లో సీబీఐ సోదాలు

లాలూ ప్రసాద్ యాదవ్ (File)

లాలూ ప్రసాద్ యాదవ్ (File)

CBI raids in lalu home : దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్​పై ఇటీవలే విడుదలైన బీహార్(Bihar)మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ కు మరో షాక్ తగిలింది. లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)పై మరో కేసు నమోదైంది.

ఇంకా చదవండి ...

CBI raids in lalu home : దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్​పై ఇటీవలే విడుదలైన బీహార్(Bihar)మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ కు మరో షాక్ తగిలింది. లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)పై మరో కేసు నమోదైంది. యూపీఏ హయాంలో 2004-09 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఆశావహుల నుంచి భూములు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించే సీబీఐ(CBI)లాలూపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లను కూడా సీబీఐ చేర్చింది ఈ కేసుకు సంబంధించి బీహార్ రాజధాని పట్నాలోని లాలూ నివాసంపై సీబీఐ అధికారులు దాడులు(CBI Raids)చేశారు. లాలూ సతీమణి రబ్రీ దేవి ఇల్లు సహా ఢిల్లీ, బీహార్ ​లో లాలూకు చెందిన మొత్తం 16 చోట్ల తనిఖీలు చేస్తున్నారు.

అయితే సీబీఐ చర్యలపై ఆర్జేడీ నాయకులు మండిపడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కావాలనే తమ నేతను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. బలమైన గొంతుకను అణచివేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సీనియర్ నేత ఆలోక్ మెహతా ధ్వజమెత్తారు. కాగా,దాణా కుంభకోణం కేసులో లాలూకి సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. Doranda ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లను అక్రంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెలలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు నుంచి బయటకు వచ్చారు.

ALSO READ  Right to dignity : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు..కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

అంతకుముందు, నాలుగు పశు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా కోర్టులు తేల్చిన విషయం తెలిసిందే. చైబాసా ట్రెజరీ నుండి విడతల వారీగా రూ.37.7 కోట్లు, రూ.33.13కోట్లు డియోఘర్ ట్రెజరీ నుండి రూ. 89.27 కోట్లు, రూ.3.76 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. 2018లో దుమ్కా కేసులో దోషిగా తేలినందుకు లాలూ ప్రసాద్ యాదవ్ కి రూ. 90 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. గతంలోని నాలుగు కేసులపై వచ్చిన తీర్పులను కూడా లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ చేశారు. ఇక, 2017 డిసెంబర్ నుండి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉన్నాడు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోనే ఎక్కువకాలం శిక్షను అనుభవించాడు.

First published:

Tags: Bihar, CBI, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు