EPS : ఉద్యోగుల పెన్షన్ (సవరణ) స్కీమ్, 2014ను సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో 2014కి ముందు ఎన్‌హ్యాన్స్‌డ్ పెన్షన్ కవరేజీని ఎంచుకోని ఉద్యోగులకు ఇప్పుడు అవకాశం లభించింది. తమ యజమానులతో కలిసి రాబోయే నాలుగు నెలల్లో పెన్షన్ కవరేజీని ఉద్యోగులు ఎంచుకోవచ్చు. పెన్షన్ ఫండ్‌లో చేరడానికి మంత్లీ శాలరీ రూ.15 వేలుగా ఉండాలని నిర్దేశించిన థ్రెషోల్డ్ లిమిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రూ.15,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు 1.16 శాతం మనీ కాంట్రిబ్యూట్ చేయాలనే నిబంధనను కొట్టివేసింది.
ఎక్స్‌ట్రార్డనరీ మీటింగ్ ఏర్పాటు చేయాలి
2014 సెప్టెంబర్ 1 నాటికి చేరిన, ఇప్పుడు ఉన్న EPS సభ్యులు వారి 'యాక్చువల్' శాలరీలో 8.33 శాతం వరకు, నెలకు రూ.15,000కి పరిమితం చేసిన పెన్షనబుల్ జీతంలో 8.33 శాతం నుంచి పెన్షన్‌కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఈ విధంగా ఉద్యోగులు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలరు, పదవీ విరమణ తర్వాత అధిక వార్షికాదాయంతో సహా మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఉత్తర్వులను అనుసరించి, త్వరితగతిన అమలు చేయడానికి రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎక్స్‌ట్రార్డనరీ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
హింద్ మజ్దూర్ సభ జనరల్ సెక్రటరీ హర్భజన్ సింగ్ సిద్ధూ పీటీఐతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) సబ్‌స్క్రైబర్లకు అధిక సంపాదనపై పెన్షన్‌ను ఎంచుకోవడానికి సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రి నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ప్రత్యేక సమావేశం ఈ ఉత్తర్వులపై వివరంగా చర్చించి సభ్యులకు ఇచ్చిన ఉపశమనాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత చట్టాన్ని సవరించకుండా అధిక సంపాదనపై పెన్షన్‌ను ఎంచుకోవడానికి ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్ల జీతంలో అదనంగా 1.16 శాతం కంట్రిబ్యూషన్‌ను ఈపీఎప్‌వో కోరకూడదని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపారు. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్‌ల సబ్‌స్క్రైబర్లు కూడా అధిక సంపాదనపై పెన్షన్ ఆప్షన్‌ను కోర్టు ఇచ్చిందని వివరించారు.
Bhojan Niyam: శాస్త్రోక్తంగా తినే నియమాలు తెలుసుకోండి.. ఎప్పుడు ఎటువంటి సమస్య రాదు..
సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇవే
అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో.. ఈ పరిస్థితుల్లో స్కీమ్‌లోని పేరా 11(4) కింద ఎంపిక చేసుకునే సమయం మరో నాలుగు నెలల పాటు పొడిగించినట్లు తెలిపింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 142 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. EPS-95 పేరా 11 (4) సభ్యులు అధిక సంపాదనపై పెన్షన్‌ను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. 2014 సెప్టెంబర్ 1 నాటికి EPS సభ్యులుగా ఉన్న ఉద్యోగులు మాత్రమే తమ జీతాలకు అనుగుణంగా పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్ చేయడం కొనసాగించవచ్చని పేర్కొంది. కొత్త పెన్షన్ విధానాన్ని ఎంచుకోవడానికి వారికి ఆరు నెలల సమయం ఇచ్చింది. అయితే 2014 సవరణల్లో ఈ కటాఫ్ తేదీని సుప్రీంకోర్టు తొలగించింది.
ఉత్తర్వుల అమలుకు డిమాండ్
మరో ఈపీఎఫ్‌ఓ ట్రస్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సుంకరి మల్లేశం కూడా CBT ఎక్స్‌ట్రార్డనరీ మీటింగ్‌ను డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులపై కూలంకషంగా చర్చించి సభ్యులకు ఉపశమనం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని మల్లేశం పీటీఐకి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Pension Scheme