• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • NOW CRISILS LOWERS INDIAS GDP GROWTH FORECAST SAYS SLOW DOWN MS

షాకింగ్ : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ మనం ఊహిస్తున్న దానికంటే ఎక్కువే...

ప్రతీకాత్మక చిత్రం

Indian Economy Crisis : సెప్టెంబర్ ఆరంభంలో ఆర్బీఐ కూడా భారత జీడీపీ వృద్దిరేటు అంచనాను 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. మార్కెట్‌లో తగ్గిన డిమాండ్, తగ్గిన పెట్టుబడుల కారణంగా ఈ సవరణ తప్పలేని స్పష్టం చేసింది.

  • Share this:
    భారత ఆర్థిక మాంద్యంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నవేళ దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిజిల్ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. భారత ఆర్థికమాంద్యం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. అంతేకాదు, భారత జీడీపీ వృద్ధి అంచనాను 2020 ఆర్థిక సంవత్సరానికి గాను 6.9 నుంచి 6.3 శాతానికి తగ్గించింది. అయితే 2019 రెండో త్రైమాసికంలో భారత వృద్దిరేటు 6.3% నుంచి కొంతమేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.గడిచిన ఆరేళ్లలో భారత జీడీపీ అత్యంత కనిష్టానికి పడిపోవడంతో క్రిజిల్ జీడీపీ వృద్దిరేటు అంచనాను తగ్గించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత వృద్దిరేటు కేవలం 5శాతం మాత్రమే నమోదైంది.

    అంతకుముందు మూడీస్ సంస్థ కూడా భారత జీడీపీ వృద్దిరేటు అంచనాను 6.8శాతం నుంచి 6.2శాతానికి తగ్గించింది. దేశంలో నెలకొన్న సంక్లిష్ట ఆర్థిక పరిస్థితులు,గ్రామీణ జీవితాల్లో నెలకొన్న అస్థిరత,తగ్గిపోయిన ఉద్యోగ నియామకాలు.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని భారత జీడీపీ వృద్దిరేటు అంచనాను తగ్గించినట్టు చెప్పింది. అంతేకాదు, 2020 జీడీపీ వృద్దిరేటు అంచనా అయిన 6.7శాతంలో 0.6శాతాన్ని మూడీస్ తగ్గించింది. కొద్ది వారాల క్రితం భారత జీడీపీపై విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను పేర్కొంది.

    సెప్టెంబర్ ఆరంభంలో ఆర్బీఐ కూడా భారత జీడీపీ వృద్దిరేటు అంచనాను 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. మార్కెట్‌లో తగ్గిన డిమాండ్, తగ్గిన పెట్టుబడుల కారణంగా ఈ సవరణ తప్పలేని స్పష్టం చేసింది. మరోవైపు భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనిపై సమాధానం ఇచ్చేందుకు విముఖత చూపారు. భారత ఆర్థిక మాంద్యంపై ప్రత్యర్థి పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఇదంతా బీజేపీ ఫెయిల్యూర్ అని, ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడంలో ఆ పార్టీ
    విఫలమైందని ఆరోపించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: