Ayodhya Verdict : మనం ఆల్రెడీ అనుకున్నాం... ఈ నెల 17న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి రంజన్ గొగోయ్ రాజీనామా చేయబోతున్నారు అని. అంటే... ఆయనకు మిగిలింది సోమవారం నుంచీ వారమే. ఈ ఏడు రోజుల్లో ఆయన... 4 కీలకమైన కేసుల్లో తీర్పులు ఇవ్వాల్సి ఉంది. నిజానికి ఆ వారంలో సుప్రీంకోర్టు పనిచేసేది మూడు రోజులే. అంతలోనే 4 కేసుల్లో తీర్పులు ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. నవంబర్ 11, 12, 16న కోర్టుకు సెలవులున్నాయి. అందువల్ల నవంబర్ 13, 14, 15 తేదీల్లో తీర్పులు రానున్నాయి. ఆ తీర్పులు ఏంటంటే... 1.రాఫెల్ డీల్. 2.మీనాక్షి లేఖి పిటిషన్, 3.మూడోది ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ 4.శబరిమల అయ్యప్ప కేసు.
కేసుల వివరాలు సింపుల్‌గా : 1. రాఫెల్ డీల్ : రాఫెల్ డీల్‌ను సమర్థిస్తూ 2018 డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్లు వేశారు. దీనిపై తీర్పు మేలో రిజర్వ్ అయ్యింది. అది ఇప్పుడు ఇస్తారు.
2.మీనాక్షి లేఖి పిటిషన్ :ఇదేంటంటే... బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై లేఖీ... ఈ ధిక్కార పిటిషన్ వేశారు. చౌకీదార్ చోర్ హై అన్న రాహుల్... స్వయంగా సుప్రీంకోర్టే... అది ఒప్పుకుందని ఎన్నికల ప్రచారంలో అన్నారు. నిజానికి సుప్రీంకోర్టు అలా ఒప్పుకోలేదు. దీనిపై తర్వాత రాహుల్ సారీ చెప్పారు. అయినప్పటికీ కేసు అలాగే ఉంది. దీనిపై తీర్పు ఇస్తారు.
3.ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ : సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ని తేవాలా వద్దా అన్నదానిపై తీర్పును ఏప్రిల్ 4న రిజర్వ్ చేశారు. దీనిపైనా తీర్పు ఇస్తారు.
4.శబరిమల అయ్యప్ప కేసు : శబరిమల ఆలయం లోపలికి అన్ని వయసుల మహిళలూ వెళ్లొచ్చని 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. దాన్ని రివ్యూ చెయ్యాలని కొన్ని పిటిషన్లు వచ్చాయి. రివ్యూకి సరే అంటారా లేక... ఇదివరకటి తీర్పే కరెక్ట్ అంటారా అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికే జస్టిస్ రంజన్ గొగోయ్ చాలా తీర్పులు ఇచ్చారు. మిగిలిన నాలుగు కేసుల్నీ ఫటాఫట్ తేల్చేయడం ఆయనకు పెద్ద మేటరేమీ కాదు. కాకపోతే... జస్ట్ మూడు రోజుల్లోనే 4 కేసులకు తీర్పులు ఇవ్వడం ఒకింత కష్టమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.