ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతాయా? బీజేపీ ప్లాన్ వేస్తోందా?

Narendra Modi : ఓడిపోతుందని ప్రతిపక్షాలు భావిస్తే, సొంతంగానే మెజార్టీ సాధించి, మరింత బలమైన పార్టీగా అవతరించిన బీజేపీ... ఇప్పుడు ప్రతిపక్షాలకు చుక్కలు చూపెడుతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 29, 2019, 8:26 AM IST
ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతాయా? బీజేపీ ప్లాన్ వేస్తోందా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Krishna Kumar N | news18-telugu
Updated: May 29, 2019, 8:26 AM IST
కేంద్రంలో బీజేపీ సొంత మెజార్టీ (303)తో రెండోసారి నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఐతే... బీజేపీ అంటేనే వ్యూహాలు పన్నడంలో దిట్ట. ఆరేళ్లు ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో రాజకీయ చతురత ప్రదర్శిస్తూ... ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మోదీ రెండోసారి అధికారంలోకి రావడంతో... ఈసారి మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. దీనిపై యూపీఏ పక్షాల పార్టీలు, బీజేపీయేతర, యూపీఏతర పార్టీలూ టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలు కూలిపోతాయన్న ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పిరాయింపులకు తెర తీస్తే, ప్రభుత్వాలు కూలినట్లే. ఇలాగే కర్ణాటకలో మెజార్టీ స్థానాలు రాక, విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండా వెనకడుగు వేసిన బీజేపీ... ఇప్పుడు జేడీఎస్‌ను తనవైపు లాక్కొని... కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

బెంగాల్‌లో బీజేపీ దూకుడు పెంచడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం సమస్యగా మారింది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిన బీజేపీ... తృణమూల్ నేతలను తమవైపు లాగేసుకుంటోంది. ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్పడంతో... మరోసారి మంత్రివర్గ విస్తరణ చెయ్యబోతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. అదే సమయంలో... మోదీ ఆహ్వానంతో ఆమె ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఇలా చేయడం వల్ల బీజేపీ తమ జోలికి రాదని దీదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఇవి కూడా చదవండి :

జూనియర్ ఎన్టీఆర్ రావాలి... టీడీపీని కాపాడాలి... లక్ష్మీపార్వతి పిలుపు...

ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడు రామ్మోహన్‌నాయుడు..? ఆ పార్టీలో ఏం జరుగుతోంది?
Loading...
ఏపీలో ఇక 26 జిల్లాలు... ఎప్పటి నుంచో తెలుసా...

విజయవాడలో హై సెక్యూరిటీ... వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యేకతలు ఇవే...
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...