మాజీ సీఎం బయోపిక్.. సినిమా పేరు లాంతర్.. హీరో ఎవరంటే..

దేశ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. ఆయన భాష, యాస, మాటలు ప్రజలను ఆకర్షితులను చేస్తాయి.

news18-telugu
Updated: October 30, 2019, 3:12 PM IST
మాజీ సీఎం బయోపిక్.. సినిమా పేరు లాంతర్.. హీరో ఎవరంటే..
డైరెక్టర్ షాడో
  • Share this:
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్ సిద్ధం కాబోతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ‘లాంతర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ గుర్తు కూడా లాంతర్ కావడం విశేషం. ఈ సినిమాలో లాలూ ప్రసాద్ యాదవ్ క్యారెక్టర్‌ను ప్రముఖ భోజ్‌పురి నటుడు యష్ కుమార్ నటిస్తున్నారు. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు. లాలూ బయోపిక్‌ను బీహార్, గుజరాత్‌లో షూటింగ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని కుమార్ తెలిపారు.

lalu prasad yadav, rjd, bihar, general elections 2019, lalu in prison, లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ, జనరల్ ఎలక్షన్స్ 2019, జైళ్లో లాలు
లాలూ ప్రసాద్ యాదవ్(File)


దేశ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. ఆయన భాష, యాస, మాటలు ప్రజలను ఆకర్షితులను చేస్తాయి. ఆయన జీవన విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా.. రోజూ ఉదయాన్నే షెడ్లో ఆవులకు పాలు పిండడం వంటి పనులు చేసేవారు. దాణా కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ సీఎంగా ఎదిగిన వైనం, యాదవుల్లో లాలూకి ఉన్న ఫాలోయింగ్ ఈ తరం వారికి తెలియజెప్పేందుకే ఈ సినిమాను తీస్తున్నట్టు యష్ కుమార్ తెలిపారు.

బైక్ స్టంట్స్‌తో నవ్వులు... క్షణాల్లో భయంతో అరుపులు

First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading