Home /News /national /

NOTIFICATION FOR PRESIDENTIAL ELECTION 2022 ISSUED PVN

President Election 2022 : రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..రాజ్ నాథ్ కు బీజేపీ కీలక బాధ్యతలు!

రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్

President Election : భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్(Ram Nath Kovind) కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక(President Election 2022) కోసం ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission)బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌(Election Notification) విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
Notification Issued For Presidential Election : భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్(Ram Nath Kovind) కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక(President Election 2022) కోసం ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission)బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌(Election Notification) విడుదల చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగనుండగా...జులై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 29. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 2 వరకు గడువు ఇచ్చారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు హౌస్, రాష్ట్రాల శాసన సభల్లో రహస్య బ్యాలట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. ఇక,లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

మరోవైపు,రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. 16వ భారత రాష్ట్రపతి ఎవరనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ్‌నాథ్‌ కోవింద్‌(Ramnath Kovind) తర్వాత ఆ పదవిని చేపట్టే వ్యక్తిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం అధికార బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టగా.. అటు విపక్షాలు కూడా పావులు కదుపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏకాభిప్రాయం తీసుకొచ్చే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​కు బీజేపీ అప్పగించింది. ఆయన ఈ విషయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.



Extramarital Affair : పెళ్లాం ఊరెళ్లిందని ప్రియురాలిని పిలిచాడు..టూర్ క్యాన్సిల్ అయి ఇంటికి భార్య..వారిద్దరినీ నగ్నంగా..

తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో రాజ్​నాథ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారని రాజ్​నాథ్ తనతో చెప్పినట్లు ఖర్గే  చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటన్న విషయాన్ని తాను అడిగినట్లు చెప్పారు. అభ్యర్థిని ఎవరిని నిలబెడుతున్నారని అడిగానని తెలిపారు. అయితే, తనతో సంప్రదింపులు కొనసాగించే విషయంపై రాజ్​నాథ్ స్పష్టతనివ్వలేదని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Election Commission of India, NOTIFICATION, President Elections 2022, President of India

తదుపరి వార్తలు