హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నేడే నోటిఫికేషన్.. రేసులో రాహుల్ గాంధీ లేనట్లే..!

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నేడే నోటిఫికేషన్.. రేసులో రాహుల్ గాంధీ లేనట్లే..!

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

Rahul Gandhi: నామినేషన్లను అక్టోబరు 24 నుంచి 30 వరకు స్వీకరిస్తారు. కానీ ఆ రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనే ఉంటారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. AICC కొత్త అధ్యక్షుడి (Congress President) ఎన్నిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈసారి గాంధీయేతర కాంగ్రెస్ నాయకుడికే అధ్యక్ష పగ్గాలు వస్తాయని చర్చ జరుగుతోంది. పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుముఖంగా లేరని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి రేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. నామినేషన్లను అక్టోబరు 24 నుంచి 30 వరకు స్వీకరిస్తారు. కానీ ఆ రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనే ఉంటారని పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు.

  మరోవైపు బుధవారం రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌ (Ashok Gehlot)... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi)తో పాటు పలువురు సీనియర్ నేతలను కలిసారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది. మరి ఆయన ఒక్కరే పోటీ చేస్తారా? లేదంటే ఇంకా ఎవరైనా బరిలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. సీనియర్ నేత శశి థరూర్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు సమాచారం. ఆయన కూడా పార్టీ ప్రధాన కార్యాలయానికి కూడా చేరుకున్నారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీని కలిశారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకుంటున్న పలువురు నేతలు.. అభ్యర్థులకు ఓటర్ల జాబితా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలోనే మధుసూదన్ మిస్త్రీని కలిసేందుకు థరూర్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

  Congress: ‘కాంగ్రెస్ చీఫ్ రేసులో నేను ఉన్నా.. ’.. దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  అశోక్ గహ్లోత్‌పై దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ పూర్‌లో ఏడాది ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోని అంశాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి.. ఒకే పదవీ అని ఆ సమావేశంలో తీర్మానించినట్లు గుర్తు చేశారు. ఒక వేళ కాంగ్రెస్ చీఫ్ గా అశోఖ్ గెహ్లత్ ఎన్నికైతే, సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు. పార్టీ చీఫ్ పదవికి పోటీలో ఉన్నారా అన్న ప్రశ్నపై.. పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. ఏదీ ఏమైన మీకు 30 వ తేదీ సాయంత్రం వరకు సమాధానం తెలుస్తోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎన్ని ఓట్లుంటాయో తెలుసా..?

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టాలని రాహుల్ గాంధీని అనేక మంతి సీనియర్ నేతలు బలపరిచారు. ఇప్పటికే పదికి పైగా రాష్ట్రాలలోని పీసీసీలు రాహుల్ గాంధీనే చీఫ్‌గా ఎన్నుకోవాలని ఏకగ్రీవ తీర్మానంచేసి ఢిల్లీకి పంపాయి. కానీ రాహుల్ గాంధీ మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అశోక్ గహ్లోత్ తెర మీదకు వచ్చారు. రాహుల్ గాంధీని ఒప్పించేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేస్తానని.. ఆ తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా.. నెరవేరుస్తానని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను అవసరమని పార్టీ భావిస్తే.. కాదనలేనని స్పష్టం చేశారు.

  కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 చివరి తేదీ. ఒక్క నామినేషనే వస్తే.. ఎన్నికలు ఉండవు. వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భావించాలి. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థుల పోటీ చేస్తే మాత్రం అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఫలితాలు వెల్లడిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Aicc, Congress, Rahul Gandhi, Sonia Gandhi

  ఉత్తమ కథలు