Girish Karnad: ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూత

Girish Karnad No More: స్వేచ్ఛా హక్కుకు గట్టిగా మద్దతు పలికే గిరీష్ కర్నాడ్.. మతాన్ని, హిందూత్వవాదాన్ని విమర్శించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 10, 2019, 10:31 AM IST
Girish Karnad: ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూత
1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాన్‌లో జన్మించన ప్రముఖ రచయత,రంగస్థల నటుడు గిరీష్ కర్నాడ్
  • Share this:
ప్రముఖ రంగ స్థల నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్(81) ఈ రోజు ఉదయం 6.30కి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని లావేలీ రోడ్‌లో ఉన్న తన నివాసంలో కన్నుమూశారు. తన రచనలకు గానూ పద్మ శ్రీ, పద్మ భూషణ్, జ్ఞానపీఠ్ సహా ఎన్నో అవార్డులు దక్కించుకున్న గిరీష్ పలు తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాన్‌లో జన్మించిన ఆయన కన్నడ భాషలో ఎన్నో గొప్ప రచనలు చేశారు. స్వేచ్ఛా హక్కుకు గట్టిగా మద్దతు పలికే గిరీష్.. మతాన్ని, హిందూత్వవాదాన్ని విమర్శించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీని కూడా వ్యతిరేకించారు.

గిరీష్ కర్నాడ్ వివిధ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో ధర్మచక్రం, శంకర్‌దాదా ఎంబీబీఎస్, కొమరం పులి చిత్రాల్లో నటించారు. హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ సినిమాల్లో తన ప్రతిభ చూపారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 10, 2019, 9:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading