కోవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి ఫ్రంట్‌లైన్ వారియర్స్ విశేషంగా సేవలు అందిస్తున్నారు. వైరస్ సోకిన వారి దగ్గరకు వచ్చేందుకు సొంత వారే సంకోచిస్తున్న సమయంలో అన్నీ తామై విధులు నిర్వహించారు.. తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని అర్థమయినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరో ఆలోచన లేకుండా విధులు నిర్వహించారు.. అసలు సెలవులే తీసుకోకుండా పని చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా ఉన్నారంటే నమ్మగలరా..? ఇండియన్ కోవిడ్ వ్యాక్సిన్ జర్నీపై ‘హిస్టరీ TV18’ రూపొందించిన తాజా డాక్యుమెంటరీ ‘ద వయల్’(The Vial) ఫ్రంట్‌లైన్ వర్కర్ల సేవలను కళ్లకు కట్టినట్లు చూపించింది.
ప్రయాణ మార్గాలు సరిగ్గా లేని ప్రాంతాలకూ వెళ్లారు:
హిమాచల్ ప్రదేశ్‌ని మలానా వాసులు వ్యాక్సిన్ పట్ల ఎలా అనుమానాలు వ్యక్తం చేశారో.. వారి భయాలను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎలా తరిమేశారో 'ద వయల్' చూపించింది. ఆరోగ్య కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం చేసిన కృషి వారిని వ్యాక్సిన్ పరిధిలోకి తీసుకురావడానికి ఎలా తీసుకొచ్చిందో'ది వయల్ - ఇండియాస్ వ్యాక్సిన్ స్టోరీ' రూపొందించిన కొత్త డాక్యుమెంటరీ వివరించింది. నిజానికి పార్వతీ లోయలోని మలానా గ్రామ ప్రజలు చాలా భిన్నం.. తామంతా అలెగ్జాండర్ ది గ్రేట్ వారసులమని ఫీల్ అవుతూ ఉంటారు.. బయట వాళ్లను అసలు దగ్గరకు రానివ్వరు.. వారు తమ గ్రామ దేవతలపై విశ్వాసం కలిగి ఉంటారు. బయటివారిని అనుమానంతో చూస్తారని కులు జిల్లా డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ చెప్పారు. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్లు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో చర్చించారని 'ద వయల్' డాక్యుమెంటరీలో చూపించారు.
మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ ఎలా చేరుకుంది?
మిజోరంలోని ఒక చిన్న గ్రామానికి వ్యాక్సిన్లు ఎలా చేరాయో ఈ డాక్యుమెంటరీలో వివరించారు. నూన్సూరి గ్రామానికి చేరుకోవడానికి, టీకాలు తయారైన పూణే నుంచి 1,500 కిలోమీటర్ల జర్నీ మొదలైందని.. మొదట కోల్‌కతా నిల్వ కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి ఐజ్వాల్‌కు తరలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) శాస్త్రవేత్త డాక్టర్ సుమిత్ అగర్వాల్ తెలిపారు. ఆ తర్వాత ట్రక్కు ద్వారా లుంగ్లీ వరకు, కారులో త్లాబంగ్ వరకు, చివరకు పడవ ద్వారా నున్సూరీ వరకు ప్రయాణం కొనసాగింది. అయితే అక్కడితో ఆగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఒక్క గ్రామస్థుడు కూడా మిస్ అవ్వకుండా చూసేందుకు హెల్త్‌కేర్ వర్కర్లు, వ్యాక్సినేటర్లు కాలినడకన బయలుదేరారు. దేశం నుంచి వైరస్‌ను తరిమికొట్టాలనే స్ఫూర్తితో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కూడా తెలివైన పరిష్కారాలకు దారితీసింది. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్‌లోని మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Narendra modi