అక్బర్ పిటిషన్‌పై విచారణ: 'ఆమె ట్వీట్ వల్లే రాజీనామాపై ఒత్తిడి'

వాదనలు ముగిసిన తర్వాత.. అక్టోబర్ 31న అక్బర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.

news18-telugu
Updated: October 18, 2018, 5:10 PM IST
అక్బర్ పిటిషన్‌పై విచారణ: 'ఆమె ట్వీట్ వల్లే రాజీనామాపై ఒత్తిడి'
ఎంజే అక్బర్ ఫైల్ ఫోటో..
news18-telugu
Updated: October 18, 2018, 5:10 PM IST
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినవారిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు విచారణకు స్వీకరించింది. గురువారం అక్బర్ తరుపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 31కి వాయిదా వేసింది. అక్బర్ తరుపున సీనియర్ న్యాయవాది గీతా లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు.

#మీటూ పేరుతో అక్బర్‌పై చేసిన ఆరోపణలు, వాటి ఆధారంగా వచ్చిన వార్తా కథనాలతో ఆయన ప్రతిష్టకు పూడ్చలేని భంగం కలిగిందని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. తాను తప్పు చేశానని అక్బర్ భావించడం లేదని, కానీ ప్రియా రమణి చేసిన ట్వీట్ ఆయన రాజీనామాపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. అక్బర్‌పై ప్రియారమణి చేసిన ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ.. దానికి 1200 లైక్స్ వచ్చాయని, వాషింగ్టన్ పోస్ట్ సహా పలు దేశీ విదేశీ మీడియా సంస్థలు సైతం దాన్ని ప్రస్తావించాయని గుర్తుచేశారు.

వాదనలు ముగిసిన తర్వాత.. అక్టోబర్ 31న అక్బర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది. అక్బర్ వాదనలు సంత‌ృప్తికరంగా ఉంటే ప్రియా రమణికి నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. అక్బర్ కోర్టుకు హాజరవుతారని, ఆయన తరుపున మరో ఆరుగురు సాక్ష్యులు కూడా కోర్టుకు వస్తారని న్యాయవాది లూథ్రా తెలిపారు.కాగా, అక్బర్ జర్నలిస్టుగా పనిచేసిన సమయంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మొత్తం 16మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి అనే పాత్రికేయురాలు మొదట ఓ ట్వీట్ ద్వారా ఆయనపై ఆరోపణలు చేయగా.. ఆ తర్వాత మరికొంతమంది ఆమెకు జతకలిశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్బర్ నైజీరియా పర్యటనలో ఉన్నారు.

నైజీరియా నుంచి ఇండియా చేరుకున్న కొద్ది గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అక్బర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలను మాత్రం అక్బర్ ఖండిస్తున్నారు. ఇది తన పరువుకు భంగం కలిగించిందని చెబుతూ ప్రియా రమణిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.ఇవి కూడా చదవండి:లైంగిక వేధింపుల ఆరోపణలు: ఎట్టకేలకు ఎంజే అక్బర్ రాజీనామా?

#MeToo: 'మీ టూ' సుడిగుండంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్
First published: October 18, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...