Home /News /national /

NOT ALLOWED TO TAKE EXAMS WEARING HIJAB 2 KARNATAKA STUDENTS LEAVE PVN

Hizab Row : హిజాబ్ ధరించి ఎగ్జామ్ కి..పరీక్ష రాసేందుకు అనుమతించని అధికారులు

;ప్రతీకాత్మక చిత్రం

;ప్రతీకాత్మక చిత్రం

Hizab row : రాష్ట్రంలోని కాలేజీల్లో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న 17 ఏళ్ల అలియా అసదీ.. గత వారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి..మన భవిష్యత్తును నాశనం చేయకుండా ఆపడానికి తమకు ఇంకా అవకాశం ఉందని ట్వీట్  చేసిన విషయం తెలిసిందే. 

ఇంకా చదవండి ...
Not Allowed To Take Exams Wearing Hijab : గత కొన్నా్ళలుగా క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. హిజాబ్ వివాదం నేపథ్యంలో తాజాగా హిజాబ్ కేసులో పిటిష‌న్ వేసిన అమ్మాయిల్లో ఇద్ద‌రికి ఇవాళ చేదు అనుభ‌వం ఎదురైంది. క్లాస్‌రూమ్‌ల్లోకి హిజాబ్‌ను అనుమతించాలని కోర్టులో మొదట పిటిషన్ వేసిన ఇద్దరు విద్యార్థినులు బురఖాలు ధరించి 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసేందుకు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లగా అధికారులు ఆ ఇదకదరు అమ్మాయిలని వెన‌క్కి పంపించారు. బురఖా ధరించే పరీక్షలు రాస్తామని హాల్ టికెట్ల‌తో ప‌రీక్ష కేంద్రానికి వెళ్లారు ఆలియా అస‌ది, రేష్మాల అనే ఇద్దరు విద్యార్థినులు. సుమారు 45 నిమిషాల పాటు ఆ అమ్మాయిలు ఇన్విజిలేట‌ర్లు, ప్రిన్సిపాల్‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అందుకు ససేమిరా అనడంతో పరీక్షా కేంద్రం నుండి విద్యార్థినులు వెనుదిరిగారు. ఉడిపిలోని విద్యోద‌య పీయూ కాలేజీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాగా, హిజాబ్ ధార‌ించే వ‌చ్చే విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించ‌మ‌ని ఆ రాష్ట్ర మంత్రి బీసీ న‌గేశ్ ఇప్పటికే చెప్పిన విష‌యం తెలిసిందే.

రాష్ట్రంలోని కాలేజీల్లో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న 17 ఏళ్ల అలియా అసదీ.. గత వారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి "మన భవిష్యత్తును నాశనం చేయకుండా ఆపడానికి" తమకు ఇంకా అవకాశం ఉందని ట్వీట్  చేసిన విషయం తెలిసిందే. హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి మమ్మల్ని అనుమతించేలా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. దయచేసి దీనిని పరిగణించండి. మనమే ఈ దేశ భవిష్యత్తు అని  ట్వీట్ లో అలియా పేర్కొంది. రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ కూడా అయిన అలియా...కర్ణాటక హైకోర్టులో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ లో.. హిజాబ్ లేదా హెడ్‌ స్కార్ఫ్‌లపై నిషేధం ప్రీ-యూనివర్శిటీ పరీక్షలకు హాజరు కావాలనుకునే చాలా మంది విద్యార్థులను ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

ALSO READ Shocking : పెళ్లి చేసుకుందామనుకుంటే..డీజే సౌండ్ దెబ్బకు ప్రాణం పోయింది

కర్ణాటక ప్రీ యూనివర్శిటీ బోర్డ్ ఈరోజు నుండి రెండవ ప్రీ యూనివర్సిటీ పరీక్షను (12వ తరగతి బోర్డు పరీక్షలు) నిర్వహిస్తోంది. విద్యా శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., 6,84,255 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,076 కేంద్రాలలో పరీక్షలను కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించనున్నారు. డ్రెస్ కోడ్‌ ను అనుసరించి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు వివిధ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించారు. విద్యార్థులు హిజాబ్‌ ధరించి పరీక్షలకు వస్తే అనుమతించబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ స్పష్టం చేశారు. చివరి పరీక్షల సమయంలో తమ హిజాబ్‌లను ధరించడానికి అనుమతించాలని చాలా మంది ముస్లిం విద్యార్థినులు మంత్రిని అభ్యర్థించిన నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka, Muslim Minorities

తదుపరి వార్తలు