ఏఐసీసీ ఆఫీసులో చిదంబరం.. 27 గంటల్లో ఎక్కడున్నారో చెప్పిన కాంగ్రెస్ నేత

INX Media Case | 24 గంటల తర్వాత చిదంబరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తన సహచరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

news18-telugu
Updated: August 21, 2019, 8:51 PM IST
ఏఐసీసీ ఆఫీసులో చిదంబరం.. 27 గంటల్లో ఎక్కడున్నారో చెప్పిన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చిదంబరం ప్రెస్ మీట్, హాజరైన ముఖ్యనేతలు
  • Share this:
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కాంగ్రెస్ ప్రధానకార్యాలయంలో ప్రతక్షమయ్యారు. సుమారు 27 గంటల నుంచి అదృశ్యం అయిన ఆయన కాంగ్రెస్ ఆఫీసులో మీడియా కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, ప్రముఖ న్యాయవాదులు అయిన కపిల్ సిబల్, మరికొందరు ముఖ్యనేతలు ఈ మీడియా సమావేశానికి హాజరయ్యారు. రాత్రి 8.13 గంటలకు కాంగ్రెస్ ఆఫీసులో ఆయన అడుగుపెట్టారు. తనతో పాటు తీసుకొచ్చిన ప్రెస్ నోట్‌ను చదివి వినిపించారు. ‘24 గంటల్లో చాలా జరిగింది. చాలా గందరగోళం కూడా నెలకొంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేను కానీ, నా కుటుంబం కానీ నిందితులం కాదు. సీబీఐ, ఈడీ చార్జ్‌షీట్‌లో ఎక్కడా మా పేరు లేదు. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో కూడా చిదంబరం తప్పు చేశారని ఎక్కడా లేదు. కేవలం నేను, నా కొడుకు కార్తీ చిదంబరం తప్పు చేశారంటూ అబద్ధపు ప్రచారం జరిగింది. నా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసినప్పుడు నా స్నేహితులు సుప్రీంకోర్టుకు వెళ్లమన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆ పేపర్లు తయారు చేసే పనిలో నా న్యాయవాదులతో ఉన్నాం. నిన్న, ఇవాళ మా న్యాయవాదులతో ఉన్నా. నేనుచట్టం నుంచి దాక్కోలేదు. న్యాయం నుంచి తప్పించుకున్నానని ఆరోపించారు. నేను చట్టాన్ని గౌరవిస్తున్నా. విచారణ సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించారు.’ అని చిదంబరం అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని గౌరవించడం అంటే సుప్రీం నిర్ణయం కోసం ఎదురుచూడడమే అని చిదంబరం అన్నారు. జీవితం, స్వేచ్ఛ విషయంలో దేన్ని కోరుకుంటారని అడిగితే స్వేచ్ఛనే కోరుకుంటానని చిదంబరం చెప్పారు. శుక్రవారం తరకు ఆ స్వేచ్ఛా దీపమే దేశానికి వెలుగునిస్తుందన్నారు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్‌లో మీడియా సమావేశంలో తన ప్రెస్ నోట్‌ను మాత్రమే చదివి వినిపించిన చిదంబరం ఆ తర్వాత మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒకే కారులో కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీతో కలసి తన కారులో ఇంటికి వెళ్లిపోయారు.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading