దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండగా.. మంకీపాక్స్ ముప్పు తప్పదనే హెచ్చరికల నడుమ.. మరో వైరస్ వ్యాప్తి కలకలం రేపుతున్నది. కేరళ (Kerala)లో మళ్లీ నోరో వైరస్ (Norovirus) వెలుగులోకి వచ్చింది. అక్కడ కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. (Norovirus Cases In Kerala) తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో వైరస్ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు.
కేరళలో నోరో వైరస్ కేసులపై కేంద్రం అప్రమత్తమైంది. పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. కేరళలో నవంబర్లో నోరోవైరస్ తొలి కేసు నమోదైంది. ఆహారం లేదా కలుషిత ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారిలో వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
1968లో అమెరికాలోని ఒహియోలో వైరస్ను తొలిసారిగా కనుగొన్నారు. నోరో వైరస్ లలో అనేక రకాలు ఉన్నాయి. ఈ వైరస్ సోకినప్పుడు చాలా మంది ఆస్పత్రికి వెళ్లకుండానే తగ్గిపోతుంది. పిల్లలు, వృద్ధుల్లో వైరస్ శక్తివంతంగా పనిచేసి ప్రమాదకారణంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, మెట్రో, ఆసుపత్రులు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాలు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కేంద్రాలుగా నిలుస్తాయి.
నోరో వైరస్ అంటువ్యాధి, వేగంగా వ్యాపిస్తుంది. కలుషితమైన నీరు తాగడం, కలుషితమైన ఆహారం తినడం, రోగితో ఆహారం పంచుకోవటం, చేతులు తాకడం, వైరస్ ఉన్న వ్యక్తితో సన్నిహిత, శారీరక సంబంధం కలిగి ఉండటం వల్ల నోరో వైరస్ సోకే అవకాశం ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారిలో నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు, కండరాలలో నొప్పి, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఎక్కువ రోజులు ఉండే వైద్యుడిని సంప్రదించాలి. ఇదిలా ఉంటే,
YSR Yantra Seva : రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ.175కోట్లు జమ.. నేడే యంత్ర సేవ పథకం పంపిణీ
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్రం మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 4,518 కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. తాజాగా 9 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,24,701కి పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య 25,782కు చేరింది. కొత్తగా 2,779 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 4,26,30,852కు చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, India, Kerala, Monkeypox, Norovirus