• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • NONE CAN PRESSURISE US SAYS AIADMK MINISTER JAYAKUMAR OVER SPECULATIONS OF BJP FORCING TO TAKE SASIKALA IN TO THE FOLD BA

Tamilnadu Elections: తమిళనాడులో అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ‘చిన్నమ్మ’ చిచ్చు..

Tamilnadu Elections: తమిళనాడులో అన్నాడీఎంకే - బీజేపీ మధ్య ‘చిన్నమ్మ’ చిచ్చు..

శశికళ(ఫైల్ ఫొటో)

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ అధికార అన్నాడీఎంకే పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. చిన్నమ్మ శశికళ విషయంలో ఆ రెండు పార్టీల మధ్య వివాదం జరుగుతున్నట్టు తెలిసింది.

  • Share this:
    తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ అధికార అన్నాడీఎంకే పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. చిన్నమ్మ శశికళ విషయంలో ఆ రెండు పార్టీల మధ్య వివాదం జరుగుతున్నట్టు తెలిసింది. శశికళ వల్ల విజయావకాశాలు దెబ్బతింటాయని బీజేపీ భావిస్తోంది. అయితే, ఆమెను మళ్లీ పార్టీలోకి తీసుకోకూడదని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు మంత్రి జయకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమను ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టం చేశారు. ‘మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేదు. మా పార్టీ అంతర్గత విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. ఇంతకుముందే సీఎం చెప్పినట్టు ఏఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇది మా కచ్చితమైన నిర్ణయం. అమిత్ షాతో సమావేశంలో విలీనం గురించి చర్చించినట్టు మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఏఎంఎంకేలో గుంటనక్కలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో సింహాలు ఉన్నాయి. ఇక అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు సుజావుగా జరుగుతుంది. దీనిపై త్వరలో నిర్ణయానికి వస్తాం.’ అని జయకుమార్ స్పష్టం చేశారు.

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2జీ, 3జీ, 4జీలకు కొత్త అర్థం చెప్పారు. తమిళనాట ప్రతిపక్ష డీఎంకే పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తమిళనాడులో కుటుంబ రాజకీయాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి 2జీ, 3జీ, 4జీలను వినియోగించారు. 2జీ అంటే మారన్ కుటుంబంలో రెండు తరాలు, 3జీ అంటే కరుణానిధి కుటుంబంలో మూడు తరాలు, 4జీ అంటే కాంగ్రెస్ కుటుంబంలో నాలుగు తరాలు అంటూ విమర్శలు గుప్పించారు. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. పదేళ్లుగా పవర్ లో ఉన్న అన్నాడీఎంకే హాట్రిక్ కొట్టాలని చూస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్ష డీఎంకే ఈసారైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు