హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పూజారుల‌గా అన్ని కులాల వారికీ అవ‌కాశం: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం

పూజారుల‌గా అన్ని కులాల వారికీ అవ‌కాశం: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్

అన్ని కులాల వారు పూజ‌లు అయ్యే ప‌థ‌కాన్ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టింది. ఈ ప‌థ‌క ప్రారంభం సంద‌ర్భంగా త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి స్టాలిన్ 58 మందికి నియామ‌క ఉత్త‌ర్వుల‌ను అందించారు.

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. హిందూ దేవాల‌యాల్లో బ్రాహ్మ‌ణేత‌ర కులాలు వారిని పూజారులుగా నియ‌మించింది. చెన్నైలో శ‌నివారం 58 మందికి ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను అందించింది. వారికి త‌మిళ‌నాడు హిందూ రిలీజియ‌స్ అండ్ చారిట‌బుల్ ఎండోమెంట్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ అందించారు.

2006లోనే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టినా న్యాయ ప‌ర‌మైన సమ‌స్య‌ల‌తో పూర్తిగా అమ‌లు కాలేదు. 2021 రాష్ట్ర శాస‌న స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం డీఎంకే పార్టీ ఇత‌ర కులాల వారికి అర్చ‌క‌త్వం ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని అమ‌లు చేస్తు రాష్ట్ర ముఖ్య మంత్రి స్టాలిన్ 58మందిని పూజారుల‌గా నియ‌మించారు. ఇందులో 24 మంది ప్ర‌భుత్వం శిక్ష‌ణ ఇవ్వ‌గా మ‌రో 34 మంది ప్రైవేటుగా శిక్షణ పొందిన వారు ఉన్నారు.

ప్ర‌భుత్వం నియ‌మించిన 24 మందిలో  5 గురు షెడ్యూల్ కులాల వారు, 6 గురు ఎంబీసీలు, 12 మంది బీసీలు ఉండ‌గా ఒక‌రి ఓసీ ఉన్నారు. వీరితోపాటు మ‌రో 138 మందిని ఆల‌యాల్లో ప‌ని చేయ‌డానికి నియ‌మించారు. రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల్లో త‌మిళంలోనే పూజ చేసే ప‌థ‌కాన్ని ఇటీవ‌లే మొద‌లు పెట్టారు. ఇక మీద అర్చ‌కులు  అన్ని దేవాల‌యాల్లో త‌మిళంలోనే పూజ‌లు నిర్వ‌హంచ‌నున్నారు. ఈ నిర్ణ‌యాన్నిత‌మిళ‌నాడులో ప‌లు సంస్థ‌లు స్వాగ‌తిస్తున్నాయి. ఇంది మంచి మార్పు నిస్తుంద‌ని వారు అభిప్రాయ ప‌డుతున్నారు.

First published:

Tags: DMK, Hindu Temples, Tamilnadu

ఉత్తమ కథలు