నిత్యానంద స్వామికి షాక్ ఇచ్చిన కర్ణాటక కోర్టు

నిత్యానంద మీద అత్యాచారం, అసహజ శృంగారం, మోసం, నేరపూరిత చర్యలు, ఆధారాలు మాయం చేయడం - తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్రపూరిత నేరం ఆరోపణల కింద కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: February 19, 2020, 6:58 PM IST
నిత్యానంద స్వామికి షాక్ ఇచ్చిన కర్ణాటక కోర్టు
స్వామి నిత్యానంద (Twitter/@vishal185526203)
  • Share this:
ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి కర్ణాటక కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కర్ణాటకలోని రామనగర్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఫిబ్రవరి 5న నిత్యానంద పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిందంటూ సీఐడీ అధికారులు రామనగర కోర్టును ఆశ్రయించారు. నిత్యానంద పెట్టుకున్న బెయిల్ బాండ్స్‌ను రద్దు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. గుజరాత్‌లోని ఓ ఆశ్రమంలో మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినట్టు నిత్యానంద మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో నిత్యానంద భారతదేశం విడిచిపారిపోయాడు. 

Kailaasa country, Nithyananda news, Nithyananda in Ecuador,Nityananda fled to Haiti,నిత్యానంద,నిత్యానంద దేశం,కైలాసం,నిత్యానంద దీవి,నిత్యానం కైలాసం దేశం,నిిత్యానంత పరారీ,నిత్యానంద హయాతీ
నిత్యానంద


 

గుజరాత్ పోలీసుల విజ్ఞప్తి మేరకు జనవరి 22న ఇంటర్ పోల్ నిత్యానంద మీద బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు గుజరాత్ పోలీసులు 2019 డిసెంబర్ 4న బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వాలని కోరారు. మరోవైపు నిత్యానంద ‘ఆధ్యాత్మిక పర్యటన’లో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు ఇవ్వడానికి వీలుపడలేదని కర్ణాటక పోలీసులు ఫిబ్రవరి 3న హైకోర్టుకు తెలిపారు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా మారిన నిత్యానంద ఏడాది నుంచి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఆయన ఆశ్రమంలో కూడా లేరు.telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
నిత్యానంద


నిత్యానంద మీద అత్యాచారం, అసహజ శృంగారం, మోసం, నేరపూరిత చర్యలు, ఆధారాలు మాయం చేయడం - తప్పుడు సమాచారం ఇవ్వడం, కుట్రపూరిత నేరం ఆరోపణల కింద కేసులు నమోదయ్యాయి.
First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading