హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇవాళ్టి నుంచే నామినేషన్లు.. ఎవరైనా పోటీ చేయొచ్చు

Congress: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇవాళ్టి నుంచే నామినేషన్లు.. ఎవరైనా పోటీ చేయొచ్చు

(Telangana Congress)

(Telangana Congress)

Congress Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు. అక్టోబరు 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో పోలింగ్ ఉంటుంది. అక్టోబరు 19న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికల (Congress President Elections) సందడి నెలకొంది. ఇవాళ్టి నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ఎన్నికల్లో పోటీచేయాలనే అభ్యర్థులకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ పత్రాలను  అందజేస్తారు. నామినేషన్లను కూడా అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. గాంధీ కుటుంబ సభ్యులెవరూ  పోటీ చేయడం లేదని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) క్లారిటీ ఇవ్వడంతో.. ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.  గాంధీ కుటుంబ సభ్యులకు వీర విధేయుడిగా ఉన్న అశోక్ గహ్లోత్‌కే సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) మద్దతుగా ఉన్నప్పటికీ.. ఇతర నేతలు కూడా ముందుకు వస్తున్నారు. తామూ పోటీలో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ లేనంతంగా ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొంది.

  ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రేసులో అశోక్ గహ్లోత్ ముందు వరుసలో ఉన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో దానికి కూడా ఆయన అంగీకరించారు. ఒకవేళ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులు కూడా ఆయనకే ఉండడంతో.. పార్టీలోని మెజారిటీ నేతలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్నే బలపరుస్తున్నారు. కానీ తాను కూడా ఎన్నికల్లో పోటీచేస్తానని.. పలువురు నేతలు ముందుకొస్తున్నారు. అందులో కేరళకు చెందిన శశిథరూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.

  Congress: మేమూ ఉన్నాం.. కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో మరికొందరు నేతలు.. కావాలనే చేస్తున్నారా?

  అశోక్ గహ్లోత్‌ను ఏకగ్రీవం చేయాలని పార్టీలోని మెజారిటీ నేతలు భావిస్తున్న తరుణంలో.. శశిథరూర్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు ముందుకు రావడంపై... సొంత పార్టీ నేతల్లోనే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్.. శశిథరూర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో.. పార్టీలో సంస్కరణలు కోరుతూ.. లేఖరాసిన 23 మంది నేతల్లో శశిథరూర్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. ఆ చర్య వల్ల కాంగ్రెస పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా ఎంతో బాధపడ్డారని అన్నారు. అలాంటి శశిథరూర్ ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేస్తారా? అని విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. పార్టీ జాతీయ కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వారిపై.. నేతలెవరూ విమర్శలు చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉందని ఆన్నారు.

  సెప్టెంబరు 24 నుంచి సెప్టెంబరు 30 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అక్టోబరు 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో పోలింగ్ ఉంటుంది. అక్టోబరు 19న ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తైన పూర్తయ్యాక.. ఫలితాలను ప్రకటిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Congress, Congress President Elections, Rahul Gandhi, Sonia Gandhi

  ఉత్తమ కథలు