హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ నేలమట్టం..100 మీటర్ల భవనాలు.. 10 సెకన్లలోనే ఫసక్..

Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ నేలమట్టం..100 మీటర్ల భవనాలు.. 10 సెకన్లలోనే ఫసక్..

ట్విన్ టవర్స్ కూల్చివేత

ట్విన్ టవర్స్ కూల్చివేత

Noida Twin Towers: ట్విన్ టవర్స్ పేల్చివేతకు 3700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లోని 9600 ప్రాంతాల్లో రంధ్రాలు చేసి..పేలుడు పదార్థాలను అమర్చారు. వాటర్‌ఫాల్స్ ఇంప్లోజన్ టెక్నాలజీ ఉపయోగించి.. భవనాలను నిట్టనిలువుగా పడగొట్టారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నోయిడాలోని సెక్టార్ 93-Aలో ఉన్న ట్విన్ టవర్స్ (Noida Twin Towers Demolition) అపెక్స్, సియానే కుప్పకూలాయి. 100 మీటర్ల పొడవన్న భవనాలు కేవలం 10 సెకన్లలోనే నేలమట్టమయ్యాయి. ఎడిపైస్ సంస్థ (Edifice) వీటిని పడగొట్టింది. మన దేశానికి చెందిన బ్లాస్టర్ చేతన్ దత్తా (Chetan Dutta) సరిగ్గా మధ్యాహ్నం 02.30 నిమిషాలకు బటన్ నొక్కి ట్విన్ టవర్స్‌ని కూల్చేశారు. ట్విన్ టవర్స్ పేల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లోని 9,600 ప్రాంతాల్లో రంధ్రాలు చేసి..పేలుడు పదార్థాలను అమర్చారు. వాటర్‌ఫాల్స్ ఇంప్లోజన్ టెక్నాలజీ ఉపయోగించి.. భవనాలను నిట్టనిలువుగా పడగొట్టారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పక్కన ఉండే భవనాలకు నష్టం కలగలేదు. ఉన్న చోటే.. నిట్టనిలువుగా.. పడిపోయాయి. ఎడిఫైస్ సంస్థ, నోయిడా అధికార యంత్రాంగం, పోలీసులు కలిసికట్టుగా పనిచేసి.. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అనుకున్న సమయానికే అనుకున్నట్లుగానే వాడిని పడగొట్టారు.
  ట్విన్ టవర్స్ కూలిపోయాక పెద్ద ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. ఆకాశంలో భారీ ధూళి మేఘం ఏర్పడింది. చాలా దూరం వరకు ఆ దుమ్ము కనిపించింది. పక్కన ఉన్న భవనాలకు కూడా ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
  ట్విన్ టవర్స్ శిథిలాలను సెక్టార్ 80లోని వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌కు తీసుకెళ్తారు. ఇందుకోసం 3 నెలల సమయం పట్టవచ్చు. అనంతరం భవన శిథిలాల నుంచి స్టీల్‌ను వేరుచేస్తారు. రెండు భవనాలను కూల్చివేస్తే 55వేల టన్నుల వ్యర్థాలు వస్తాయి. అందులో నాలుగు వేలకు పైగా స్టీలే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ జంట భవనాల కూల్చేందుకు రూ.20 కోట్ల మేర ఖర్చవుతుంది. ఇందులో రూ.5 కోట్లను సూపర్ టెక్ కంపెనీ చెల్లిస్తుంది. మిగిలిన డబ్బును శిథిలాల నుంచి వేరు చేసిన స్టీల్‌ను అమ్మడం ద్వారా సమకూర్చుతారు.  ట్విన్ టవర్స్‌లో ఒక దాని పేరు అపెక్స్. మరో భవనం పేరు సియానే. ఇందులో ఒక దాని ఎత్తు 107 మీటర్లు.. రెండవది 97 మీటర్లు. అపెక్స్‌ బిల్డింగ్‌లో 32 ఫోర్లు.. సియానేలో 29 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ రెండు భవనాల్లో కలిపి మొత్తం 850 ఫ్లాట్స్ ఉన్నాయి. ఐతే సూపర్ టెక్ సంస్థ.. నిబంధనలకు విరుద్ధంగా ఎత్తును పెంచారని సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఆ భవనాలను నిబంధనలను విరుద్ధంగా నిర్మించారని స్పష్టం చేసింది. అనంతరం ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం ఆ రెండు భవనాలను నేలమట్టం చేసింది. ఇక ట్విన్ టవర్స్‌లో ఇప్పటికే ఫ్లాట్స్ కొన్నవారికి సూపర్ టెక్ సంస్థ తిరిగి డబ్బు ఇస్తుంది. 12శాతం వడ్డీ కూడా చెల్లిస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: National, Noida, Noida Twin Towers

  ఉత్తమ కథలు