కొత్త వాహన చట్టంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డపై వాహనదారులు, ట్రాఫిక్ పోలీసుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా లేకున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్త చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఈ ట్రాఫిక్ రూల్స్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు తీశాయి. చలాన్ విషయంలో ట్రాఫిక్ పోలీసుతో గొడవపడిన టెకీ గుండెపోటుతో మరణించాడు. నోయిడాలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నోయిడాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తుండగా ఘజియాబాద్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. కారుపై లాఠీలతో కొడుతూ దురుసుగా ప్రవర్తించారు. కారుకు సంబంధించిన పత్రాలు చూపించాలని గట్టిగా అరిచారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తచేసిన టెకీ.. కారు నుంచి బయటకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వాహనదారులతో మర్యాదగా వ్యవహరించాలని.. కారులో వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా లాఠీలతో కొడతారా అంటూ నిలదీశారు.
ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. అంతలోనే టెకీ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ట్రాఫిక్ పోలీసుల తీరు వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తండ్రి ఆరోపిస్తున్నాడు. తమ కారు ఎలాంటి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించలేదని.. ఐనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
కాగా, సెప్టెంబరు 1 దేశంవ్యాప్తంగా నుంచి నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చచింది. కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు పడుతున్నాయి. వేలకు వేలు ఫైన్లు పడుతుండడంతో కొందరైతే వాహనాలను పోలీసుల దగ్గరే వదిలివేసి వెళ్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motor Vehicle Act 2019, Traffic, Traffic challans, Traffic police, Traffic rules