హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Noida Twin Towers : నోయిడా జంట టవర్ల కూల్చివేతకు అంతా రెడీ..బటన్ నొక్కేది అతడే

Noida Twin Towers : నోయిడా జంట టవర్ల కూల్చివేతకు అంతా రెడీ..బటన్ నొక్కేది అతడే

నోయిడా ట్విన్ టవర్స్

నోయిడా ట్విన్ టవర్స్

Noida Twin Towers Demolish : ఢిల్లీకి అత్యంత సమీపంలో నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్(Supertech Limited) సంస్థ నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత(Noida Twin Towers Demolish) కు అంతా సిద్దమైంది. ఆదివారం(ఆగస్టు 28,2022)న కేవలం 9 సెకన్లలో నేలమట్టం ఈ ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Noida Twin Towers Demolish : ఢిల్లీకి అత్యంత సమీపంలో నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్(Supertech Limited) సంస్థ నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత(Noida Twin Towers Demolish) కు అంతా సిద్దమైంది. ఆదివారం(ఆగస్టు 28,2022)న కేవలం 9 సెకన్లలో నేలమట్టం ఈ ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి. 3,500 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించి ఆగస్ట్ 28 మధ్యాహ్నం 2.30గంటలకు నొయిడా 93A సెక్టార్‌లోని జంట టవర్లు కూల్చనున్నారు.  బిల్డింగ్‌ కూల్చివేత బాధ్యతలను ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ తీసుకుంది. భారత బ్లాస్టర్ చేతన్ దత్తా పేలుడు కోసం తుది బటన్‌(Final Buton)ను నొక్కుతారని ఎడిఫైస్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ మయూర్ మెహతా తెలిపారు.


ఈ ట్విన్ టవర్స్  కూల్చివేతల గురించి ఎడిఫైస్ ఇంజినీరింగ్‌ సంస్థ ప్రతినిథి ఒకరు మాట్లాడుతూ..కూల్చివేతల కోసం 8810 రంద్రాల్లో పేలుడు పదార్ధాలు అమర్చింది అని తెలిపారు. పై నుంచి నీరు అమాంతం కిందకు దుమికినట్లు.. ఈ భవనాలు కుప్పకూలుతాయి’ అని వెల్లడించారు. ఈ కూల్చివేత క్రమంలో పక్కన ఉన్న భవన యజమానులతో సదరు సంస్థ చర్చలు జరిపింది. కూల్చివేత సమయంలో వెలువడే దుమ్ము, శిథిలాల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నెట్స్‌, పెరిమీటర్ కర్టైన్స్‌ వంటివి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేలుడుతో వచ్చే ప్రకంపనల వల్ల పక్కనున్న భవనాలకు ఎలాంటి హాని కలగకుండా కుషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత నేపథ్యంలో వాటి పక్కనే ఉన్న రెండు సొసైటీల్లో విద్యుత్, గ్యాస్ పైప్‌లైన్ కట్ కానుంది దాదాపు 1500 కుటుంబాలకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు నిలిచిపోనున్నాయి. ఆదివారం ఉదయం 6:30 గంటలకు విద్యుత్, గ్యాస్ కనెక్షన్ల సరఫరా నిలిచిపోతుంది.


ఎదురులేని మనిషి: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత మోదీనే


నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో పేలుడు జరిగే రోజు మధ్యాహ్నం 2.15 నుండి 2.45 గంటల వరకు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిపిపివేయనున్నారు. ఎక్స్‌క్లూజన్ జోన్ లో పేలుడు జరిగే సమయంలో మనుషులు, జంతువులు,వాహనాలకు ఎటువంటి అనుమతి లేదు. దీంట్లో భాగంగా ఎమరాల్డ్ కోర్టు రోడ్డు, ఢిల్లీ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ రోడ్డు, ATS విలేజ్ ముందు ఉన్న రహదారి అధికారులు మూసివేయనున్నారు. ముందు ముందస్తు జాగ్రత్తల కోసం అగ్నిమాపక టెండర్లు..అంబులెన్స్‌లను ట్విన్ టవర్స్ పరిసరాల్లో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు.


టవర్ల కూల్చివేత దృష్ట్యా భద్రతా కారణాలను పేర్కొంటూ ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31వతేదీ వరకు నగర గగనలతంలో డ్రోన్‌ ల వాడకాన్ని నోయిడా పోలీసులు నిషేధించారు. దీంతోపాటు నోయిడాలో 144 సెక్షన్ ను కూడా విధించారు. టవర్ల కూల్చివేత సందర్భంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు.40 అంతస్తుల జంట టవర్లను కూల్చడం ద్వారా 60 వేల టన్నుల శిథిలాలు బయటకు రానున్నాయి. రెండు టవర్ల నుంచి దాదాపు 7 వేల టన్నుల ఇనుము బయటకు రానుంది. ఈ ఇనుము విలువ దాదాపు రూ.38 కోట్లు. చెత్తాచెదారం కూడా కోట్ల రూపాయల్లోకి వెళ్తుందని అంచనా

Published by:Venkaiah Naidu
First published:

Tags: Noida

ఉత్తమ కథలు