హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లోనే నేలమట్టం

Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లోనే నేలమట్టం

ట్విన్ టవర్స్

ట్విన్ టవర్స్

Noida Twin Towers: భవనాలు కుప్పకూలిన వెంటనే భూమి నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు భారీ ధూళి మేఘం ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకాశం నుంచి అదంతా తొలగిపోయి.. సాధారణ స్థితి ఏర్పడేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నోయిడా(Noida)లోని సెక్టార్ 93-Aలో ఉన్న ట్విన్ టవర్స్ అపెక్స్, సియానే కూల్చివేత (Noida Twin Towers Demolition)కు సర్వం సిద్ధమైంది. నోయిడా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భవనాల చుట్టు పక్కల నివసించే దాదాపు 7వేల మందిని అక్కడి నుంచి తరలించారు. 2500 వాహనాలను ప్రత్యేక పార్కింగ్ ప్రాంతానికి తలసేకెళ్లారు. ముందు జాగ్రత్తగా విద్యుత్, భూగర్భ పైపు లైన్‌ల ద్వారా గ్యాస్ సరఫరా నిలిపివేశారు. రోడ్లపై ఉండే వీధి కుక్కలు, పెంపుడు జంతువులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. 100 మీటర్ల ఎత్తున ఈ జంట భవనాలను కూల్చేందుకు కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. మధ్యాహ్నం ట్విటన్ టవర్స్‌కి  (Noida Twin Towers Updates) 100 మీటర్ల దూరం నుంచి బటన్ నొక్కి.. వాటిని పేల్చనున్నారు. బటన్ నొక్కిన వెంటనే సెకన్ల వ్యవధిలోనే జంట భవనాలు నిట్టనిలువుగా నేలమట్టం కానున్నాయి. వీటి వల్ల ఇతర భవనాలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలను అధికారులు తీసుకున్నారు.


  Noida Twin Towers : నోయిడా జంట టవర్ల కూల్చివేతకు అంతా రెడీ..బటన్ నొక్కేది అతడే


  భవనాలు కుప్పకూలిన వెంటనే భూమి నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు భారీ ధూళి మేఘం ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకాశం నుంచి అదంతా తొలగిపోయి.. సాధారణ స్థితి ఏర్పడేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లోకి దుమ్ము వెళ్లకుండా, వాటికి నష్టం జరగకుండా జియో టెక్స్‌టైల్ కవరింగ్ ఉయోగిస్తున్నారు.


  అంతేకాదు ట్విన్ టవర్స్  వైపుగా విమానాలు రాకుండా చూసుకోవాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు భారత వైమానిక దళాన్ని నోయిడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ట్విన్ టవర్స్‌ చుట్టు పక్కల ఒక నాటికల్ మైల్ (1.8 కిలోమీటర్ల) పరిధిలో గగనతలాన్ని మూసివేశారు.  ఎలాంటి విమాన రాకపోకలు జరగకుండా చర్యలు చేపట్టారు.


  Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చేందుకు అన్ని కోట్ల ఖర్చవుతుందా? ఆ డబ్బులు ఎవరిస్తారు?


  ట్విన్ టవర్స్ కూల్చివేత వల్ల 30 మీటర్ల పరిధిలో భూప్రకంపనలు సంభవిస్తాయి. సెకనుకు 30 ఎం.ఎం. మాగ్యిట్యూడ్‌తో ఇవి వస్తాయని అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై 0.4 భూకంపంతో ఇది సమానమని వెల్లడించారు. కూల్చివేత అనంతరం వచ్చే దుమ్ముధూళి వల్ల ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం జరిగే అవకాశముంది. దీని కొలిచేందుకు  జంట భవనాల చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు ఢిల్లీలోనూ ప్రత్యేకమైన పరికరాలను ఏర్పాటు చేశారు.


  ఇక కూల్చివేతకు 15 నిమిషాల ముందు నంచే నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై 450 మీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. కూల్చివేత పూర్తైన 15 నిమిషాల తర్వాత పునరుద్ధరిస్తారు. ట్విన్ టవర్స్‌ను కూల్చివేశాక.. అక్కడ 55వేల టన్నుల వ్యర్థాలు పోగవుతాయి. అందులో 4వేల టన్నుల వరకు ఉక్కు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ శిథిలాలను తొలగించడానికే దాదాపు 3 నెలల సమయం పడుతుంది.  కాగా, ఈ ట్విన్ టవర్స్‌ని సూపర్ టెక్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిందని సొసైటీ వారు కోర్టులో కేసు వేయడంతో దానిపై విచారించిన సుప్రీంకోర్టు.. కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే జంట భవనాలను నోయిడా అధికార యంత్రాంగం కూల్చివేస్తోంది. ఇందులో ఇప్పటికే ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి సూపర్ టెక్ సంస్థ డబ్బులను తిరిగి వస్తుంది. 12 శాతం వడ్డీని కూడా చెల్లిస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: National News, New Delhi, Noida

  ఉత్తమ కథలు