సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) కొత్త పంథాలలో అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఆన్ లైన్,ఓటీపీ మోసాలు, అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేయడం, సెల్ ఫోన్ లలో మెసెజ్ లకు పాల్పడిన ఘటనలు మనకు తెలిసిందే. తాజాగా, వీరు కొత్తగా మ్యాజిక్ పెన్నుతో రంగంలోకి దిగి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ప్రతిసారి మోసాలకు పాల్పడటానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో.. నోయిడా (Uttar Pradesh) అదనపు పోలీస్ కమిషనర్ అశుతోష్ ద్వివేదీ కీలక వ్యాఖ్యలుచేశారు. ప్రస్తుతం కొందరు సైబర్ నేరగాళ్లు ఎల్ఐసీ పాలసీలు, తక్కువ రుసుముతో రుణం ఇస్తామంటూ అమాయకులను నమ్మిస్తున్నారు. ఆతర్వాత.. వారిదగ్గర ఉన్న మ్యాజిక్ పెన్నుతో (Magic Pen) ఫామ్ ను నింపుతున్నారు. ఇదంతా నిజమే అనుకుంటున్న అమాయకులు.. వారుమాత్రం ఒరిజినల్ పెన్నుతో ఫామ్ మీద సైన్ పెడుతున్నారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.
నేరగాళ్లు రాసినవి కొద్ది సేపటి తర్వాత మాయమై పోతున్నాయి. ఆ తర్వాత.. ఫామ్ మీద వారికి నచ్చినవిదంగా ఫామ్ ను నింపుకుంటున్నారు. దీంతో అసలు విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబో దిబో అంటున్నారు దీంతో బాధితులు చెక్కులపై, డ్రాఫ్ట్ లపై సంతకాలు పెట్టి మోసపోతున్నారు.
Mann Ki Baat : మన్‌కీ బాత్‌లో తెలంగాణ ప్రస్తావన.. వాళ్లకు ప్రధాని మోదీ ప్రశంసలు
అయితే.. మ్యాజిక్ పెన్నులతో నింపిన ఫామ్ కొద్ది సేపటికి మాయమైపోతున్నాయి. ఇలాంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోనికి వస్తున్నాయని అదనపు కమిషనర్ అశుతోష్ ద్వివేది పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, CYBER FRAUD, Uttar pradesh