Chandrayaan-2: విక్రం రోవర్ అదిగో ఇదిగో... ట్విట్టర్ వేదికగా ఫేక్‌న్యూస్ వీరుల అత్యుత్సాహం

ట్విట్టర్ వేదికగా కొందరు అత్యుత్సాహ నెటిజన్లు నాసా అపోలో 15 ల్యాండింగ్ సైట్ ఫోటోలను షేర్ చేసి అదే విక్రమ్ ల్యాండ్ రోవర్ అంటూ వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇస్రో సైంటిస్టు ఒకరు స్పందిస్తూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలు వాస్తవం కాదని, విక్రం ల్యాండ్ రోవర్ ఆచూకీ గుర్తించేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు.

news18-telugu
Updated: September 9, 2019, 5:32 PM IST
Chandrayaan-2: విక్రం రోవర్ అదిగో ఇదిగో... ట్విట్టర్ వేదికగా ఫేక్‌న్యూస్ వీరుల అత్యుత్సాహం
ట్విట్టర్ లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ ఫోటో...
news18-telugu
Updated: September 9, 2019, 5:32 PM IST
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న చంద్రుడి ఉపరితలం ఫోటోలు చంద్రయాన్ 2 విక్రమ్ రోవర్‌వి కావని అవన్నీ నాసా ప్రయోగించిన అపోలో 15కు సంబంధించిన చిత్రాలని నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 7, 2019న చంద్రయాన్ రెండో మిషన్‌లో భాగంగా విక్రమ్ రోవర్ 2.1 కి.మీ దూరంలో కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే ఇస్రో చైర్మన్ కె. శివన్ మాత్రం విక్రమ్ రోవర్ లొకేషన్‌ను గుర్తించామని, అయితే హార్డ్ ల్యాండింగ్ కారణంగా సిగ్నల్స్ కోల్పోయామని ప్రకటించారు. అయితే త్వరలోనే విక్రమ్ నుంచి సిగ్నల్స్ అందుకునే అవకాశం ఉందని, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే సోషల్ మీడియాలో మాత్రం కొన్ని ఫేక్ న్యూస్ లు వైరల్ గా మారాయి. ఇప్పటికే ఇస్రో చైర్మన్ శివన్ పేరిట ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి విక్రమ్ రోవర్ ఆచూకీ దొరికింద అంటూ అవాస్తవ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ట్విట్టర్ వేదికగా కొందరు అత్యుత్సాహ నెటిజన్లు నాసా అపోలో 15 ల్యాండింగ్ సైట్ ఫోటోలను షేర్ చేసి అదే విక్రమ్ ల్యాండ్ రోవర్ అంటూ వైరల్ చేస్తున్నారు. దీనిపై ఇస్రో సైంటిస్టు ఒకరు స్పందిస్తూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలు వాస్తవం కాదని, విక్రం ల్యాండ్ రోవర్ ఆచూకీ గుర్తించేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు.

Loading...



First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...