సివిల్స్ పరీక్షల అర్హత వయసులో ఎలాంటి మార్పు లేదు: కేంద్ర ప్రభుత్వం

సివిల్స్ పరీక్షకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అర్హత వయసు 32 నుంచి 27కి తగ్గించాల్సిందిగా.. కనిష్ట వయసును 21ఏళ్లు చేయాల్సిందిగా నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో సివిల్స్ అర్హత వయసు తగ్గించబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: December 25, 2018, 6:49 PM IST
సివిల్స్ పరీక్షల అర్హత వయసులో ఎలాంటి మార్పు లేదు: కేంద్ర ప్రభుత్వం
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. సివిల్స్ పరీక్షల అర్హత వయసును తగ్గించబోతున్నారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పింది. అలాంటి నిర్ణయాలేవి తీసుకోలేదని, అభ్యర్థుల వయసు విషయంలో ఇంతకుముందున్న నిబంధనలే కొనసాగుతాయని తెలిపింది.

సివిల్స్ పరీక్షలకు సంబంధించి వయసు తగ్గింపు విషయంలో కొత్తగా మేము ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అలాగే పరీక్ష అటెంప్ట్ విషయంలోనూ ఎలాంటి మార్పులు చేయడం లేదు. కాబట్టి దీనిపై జరుగుతున్న ప్రచారానికి, ఊహాగానాలకు ఇక తెరపడినట్టే.
జితేంద్ర సింగ్, పీఎంవో కార్యాలయ అధికారి, ఫించన్ల శాఖ మంత్రి


తాజా పార్లమెంట్ సమావేశంలో భాగంగా దీనిపై సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ బదులిచ్చారు. కాగా, సివిల్స్ పరీక్షకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అర్హత వయసు 32 నుంచి 27కి తగ్గించాల్సిందిగా.. కనిష్ట వయసును 21ఏళ్లు చేయాల్సిందిగా నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 'స్ట్రాటజీ న్యూ ఇండియా@75'లో భాగంగా నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదన తెచ్చింది. దీంతో సివిల్స్ అర్హత వయసు తగ్గించబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా కేంద్రమంత్రి వివరణతో దీనికి ఫుల్ స్టాప్ పడినట్టయింది.

Published by: Srinivas Mittapalli
First published: December 25, 2018, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading