రూ.2వేల నోటును రద్దు చేస్తారా.. కేంద్రం వివరణ ఇదీ..

2000 note ban | ఈ మధ్య 2వేల నోటు రద్దు గురించి సోషల్ మీడియా హోరెత్తుతోంది. దీంతో.. కేంద్రం మరోసారి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

news18-telugu
Updated: December 10, 2019, 6:40 PM IST
రూ.2వేల నోటును రద్దు చేస్తారా.. కేంద్రం వివరణ ఇదీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రూ. 2 వేల నోట్లను త్వరలోనే బ్యాన్ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి పోస్టులు భారీగానే వస్తున్నాయి. అయితే..  అలాంటిదేమీ లేదని ఇటు ఆర్బీఐ.. ఆటు కేంద్ర ఆర్థిక శాఖ చెబుతూ వచ్చాయి. ఇప్పటికే పలు మార్లు దీనిపై వివరణ కూడా ఇచ్చాయి. అయితే, ఈ మధ్య 2వేల నోటు రద్దు గురించి సోషల్ మీడియా హోరెత్తుతోంది. దీంతో.. కేంద్రం మరోసారి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రూ.2వేల నోటు రద్దుపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ నోటును రద్దు చేసే ఆలోచన లేనే లేదని స్పష్టం చేశారు.

అయితే.. ఆర్బీఐ రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్లు సమాచారం.  ఏటికేడు రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చింది ఆర్బీఐ. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. అదే.. ఈ ఏడాది మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని ఈ మధ్యే సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది కూడా.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>