ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్...

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

  • Share this:
    ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అలాంటిదేం లేదు సార్. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతానికి మా వద్ద ఏదీ లేదు.’ అని ఆ సమాధానంలో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్‌, ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఉద్యోగులను ముందుగానే రిటైర్ చేయించే అధికారం ఉంది. ఆ అధికారి సమర్థంగా పనిచేయకపోయినా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు.
    First published: