NO PROBLEM IN PREPARING FOOD INSIDE TOILET SAYS MINISTER IMARTI DEVI MS
ఇంత దారుణమా.. మధ్యాహ్నా భోజనం మరుగుదొడ్డిలో వండుతున్న వైనం..
టాయిలెట్‌ను కిచెన్‌గా మార్చిన దృశ్యం
Preparing Food In Toilet : టాయిలెట్స్‌లో భోజనం వండించడమే గాక.. వడ్డితే తప్పేంటి అని సాక్షాత్తు మంత్రి గారే అన్నారంటే వారి చిత్తశుద్దిని అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. పేద,మధ్యతరగతి పిల్లలపై ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనం ఇది. టాయిలెట్స్‌లో భోజనం వండించడమే గాక.. వడ్డితే తప్పేంటి అని సాక్షాత్తు మంత్రి గారే అన్నారంటే వారి చిత్తశుద్దిని అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వడ్డించే భోజనాన్ని మరుగుదొడ్లలో వండుతున్నారని ఇటీవల స్థానిక మీడియా చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమర్తి దేవి దీనిపై స్పందించారు. మరుగుదొడ్లలో వంట చేస్తే తప్పేంటి.. టాయిలెట్ సీటుకు, వంట చేసే స్టవ్‌కు మధ్య గ్యాప్ ఉంటే సరిపోతుందని అన్నారు. ఈరోజుల్లో అందరి ఇళ్లల్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయని.. అంతమాత్రానా ఇంట్లో భోజనం చేయకుండా ఉంటున్నామా? అని ఎదురు ప్రశ్నించారు. ఇక అంగన్వాడీలో వెలుగుచూసిన ఘటనపై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ టాయిలెట్ వినియోగంలో లేదని.. దాన్ని గులకరాళ్లతో నింపేశారని అన్నారు. వినియోగంలో లేదు కాబట్టే.. వంట పాత్రలను టాయిలెట్ సీట్‌పై పెట్టారని.. అలా పెట్టినంత మాత్రానా ఏమవుతుందని అన్నారు. ఏదేమైనా దీనిపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఘటనపై జిల్లా అధికారి దేవేంద్ర సుంద్రియాల్ మాట్లాడుతూ.. అక్కడ మధ్యాహ్నా భోజనం వండుతున్న స్వయం సహాయక బృందం టాయిలెట్‌ను కిచెన్‌లా వాడుతున్నారని అన్నారు. ఆ అంగన్వాడీ సూపర్వైజర్పై చర్యలు తీసుకున్నామని చెప్పారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.