Indian Railways: రైల్వే ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

Indian Railways: రైల్వే శాఖను గానీ, శతాబ్ది, రాజధాని లాంటి ప్రముఖ రైళ్లను గానీ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 8:24 PM IST
Indian Railways: రైల్వే ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రైల్వే శాఖను ప్రైవేటీకరిస్తారని గుప్పుమన్న వార్తలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఖండించారు. రైల్వే శాఖను గానీ, శతాబ్ది, రాజధాని లాంటి ప్రముఖ రైళ్లను గానీ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు. రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు సురేంద్ర నాథ్ అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. వంద రోజుల్లో ఈ రెండు ప్యాసింజర్‌ రైళ్లలో ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు ఇవ్వడం, బోర్డు సర్వీసెస్‌లో అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రైల్వే బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ కార్యాచరణను ఆగస్ట్‌ 31లోపు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డ్‌ను ఆదేశించిందినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, ఈ ప్రక్రియపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. పలు రైల్వే యూనియన్లు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే శాఖను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేదని, అలాంటి ప్లాన్లు కూడా లేవని స్వయంగా రైల్వే మంత్రే చెప్పడం విశేషం.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...