Home /News /national /

NO PERMISSIONS FOR METRO RAILS AND THEATERS IN LOCKDOWN 5 AK

లాక్‌డౌన్ 5లో భారీ సడలింపులు... వీటికి మాత్రం నో పర్మిషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూన్ 1 నుంచి జూన్ 30 వరకు సరికొత్త మార్గదర్శకాలతో లాక్‌డౌన్ 5 కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది.

    జూన్ 1 నుంచి జూన్ 30 వరకు సరికొత్త మార్గదర్శకాలతో లాక్‌డౌన్ 5 కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ సహా రాష్ట్రాలు కోరిన అనేక మినహాయింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... కొన్నింటిని మాత్రం నో పర్మిషన్ అని తేల్చిచెప్పింది. ఈ జాబితాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్ సర్వీసులు, సినిమా ధియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు, ఇతర మత పరమైన సమావేశాలు ఉన్నాయి. పరిస్థితిని బట్టి వీటికి ఎప్పుడు అనుమతి ఇస్తామనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక రాత్రి వేళల్లో విధించే కర్ఫ్యూ విషయంలోనూ కేంద్రం సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే లాక్‌డౌన్ 5లో మాత్రం కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Lockdown, Lockdown relaxations

    తదుపరి వార్తలు