NO NIGHT CURFEW FROM MONDAY SCHOOLS TO REOPEN KARNATAKA RELAXES COVID CURBS PVN
Night Curfew Lifted : నైట్ కర్ఫ్యూ ఎత్తివేత..స్కూల్స్ రీఓపెన్
నైట్ కర్ఫ్యూ (ప్రతీకాత్మక చిత్రం)
Karnataka To Withdraw Night Curfew : రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిపై సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Karnataka To Withdraw Night Curfew : కర్ణాటకలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టి,రికవరీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో జనవరి మొదటివారంలో విధించిన కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ శనివారం కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం (జనవరి 31) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిపై సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే బెంగళూరులోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెంగుళూరులో స్కూళ్లు ఓపెన్ తెరుచుకుంటాయని, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయినట్టు మంత్రి నగేశ్ తెలిపారు. ఈ మేరకు 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కళాశాలలు కూడా ఒపెన్ కానున్నాయి.
అదేవిధంగా,పెళ్లి వేడుకల్లో నిబంధనలు ఎత్తేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇండోర్‌లో జరిగే పెళ్లి వేడుకలకు 200 మంది, ఔట్‌డోర్‌లో జరిగే వేడుకలకు 300 మంది మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే 50 శాతం సిబ్బందితో బార్లు, హోటళ్లు, జిమ్‌లు కూడా ఓపెన్ కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 100 శాతం సిబ్బందితో గవర్నమెంట్ ఆఫీసులు తెరుచుకోనున్నాయి. దేవాలయాలను కూడా తెరుచుకునేందుకు అనుమతి లభించింది. అయితే మతపరమైన కార్యక్రమాలకు, రాజకీయ కార్యక్రమాలకు, ధర్నాలు చేసేందుకు అనుమతి ఇవ్వలేదని మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. క్రీడా మైదానాలు, స్టేడియంల్లో 50 శాతానికి అనుమతి ఇచ్చినట్టు మంత్రి నగేశ్ తెలిపారు. మరోవైపు, మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వ్యక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.