కేంద్రం సంచలన నిర్ణయం.. ఏడాది పాటు వాటికి బ్రేక్..

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు కొత్త పథకాలను అమలు చేయబోమని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: June 5, 2020, 2:14 PM IST
కేంద్రం సంచలన నిర్ణయం.. ఏడాది పాటు వాటికి బ్రేక్..
నిర్మల సీతారామన్ (credit -twitter - ANI)
  • Share this:
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు కొత్త పథకాలను అమలు చేయబోమని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఖర్చు తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని, దానిలో భాగంగానే పథకాలకు బ్రేక్ వేశామని తెలిపారు. కొత్త స్కీమ్‌లకు సంబంధించిన అభ్యర్థనలను కేంద్ర ఆర్థికశాఖకు పంపవద్దు అంటూ అన్ని మంత్రిత్వశాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిధుల కేటాయింపు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీకి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిధులకు ఎక్కువ డిమాండ్ ఉన్నదని, అయితే అవసరాలకు తగినట్లు నిధుల మంజూరీ ఉంటుందని ఆర్థికశాఖ పేర్కొన్నది. కేంద్ర బడ్జెట్ కింద ఇప్పటికే కొన్ని స్కీమ్‌లకు కేటాయించిన నిధులనూ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 5, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading